టీ గ్లాస్ పట్టుకున్న స్టార్ హీరో అల్లు అర్జున్.. ఆ పార్టీకి ప్రచారం చేస్తున్నారా అంటూ?
TeluguStop.com
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) నటించిన పుష్ప సినిమా( Pushpa ) పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.
ఇప్పటికి ఈ సినిమాకు క్రేజ్ తగ్గలేదని చెప్పాలి.ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సిద్ధమయ్యారు.
పుష్ప 2 ( Pushpa 2 ) అంటూ ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి వరుసగా అప్డేట్స్ విడుదల చేస్తూ వచ్చారు.
"""/" /
ఇటీవల అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఒక టీజర్ వీడియోని విడుదల చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాని షేక్ చేసిందని చెప్పాలి.అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు.
ఇటీవల విడుదలైనటువంటి ఈ పాట పుష్ప.పుష్ప .
పుష్ప.పుష్పరాజ్ అంటూ సాగిపోయే టైటిల్ సాంగ్ రిలీజ్ అయింది.
ఇక ఈ పాటకు దేవిశ్రీప్రసాద్ ( Devi Sri Prasad ) అదిరిపోయే మ్యూజిక్ అందించారని చెప్పాలి.
"""/" /
పుష్ప సినిమాలో తగ్గేదేలే అనే డైలాగుతో ఎంతో ఫేమస్ అయినటువంటి అల్లు అర్జున్ సీక్వెల్ చిత్రంలో మాత్రం అసలు తగ్గేదేలే అంటూ చెప్పినటువంటి డైలాగ్ హైలెట్ గా నిలిచింది.
ఇక ఈ పాటలో అల్లు అర్జున్ వేసిన స్టెప్పులు కూడా అందరిని ఆకట్టుకున్నాయి.
అయితే ఈయన చేతిలో గాజు గ్లాసు( Glass) లో టీ పట్టుకొని స్టెప్పులు వేయడంతో ఈ సీన్ కాస్త వైరల్ గా మారింది.
ఇలా గాజు గ్లాసులో టీ పట్టుకొని అల్లు అర్జున్ కనిపించడంతో అల్లు అర్జున్ జనసేన పార్టీ( Janasena Party ) కి మద్దతు తెలియజేస్తున్నారు అందుకే ఇలా కనిపించారు అంటూ పలువురు ఈ సన్నివేశంపై కామెంట్లు చేస్తున్నారు.
వీడియో: పనిమనిషి సోఫాలో కూర్చుందంటూ ఎన్నారై మహిళ ఫిర్యాదు.. ఆమెపై నెటిజన్లు ఫైర్!