ఇదేం దిక్కుమాలిన సలహా..ట్రంప్ పై ఫైర్ అవుతున్న అమెరికన్స్...!!!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి ఉన్న సహజ శైలి నోటికి ఏది వస్తే అదే మాట్లాడటం, రకరకాల ముఖ భావాలు వ్యక్తం చేయడం, సీరియస్ మ్యాటర్ లో కూడా సిల్లీగా కామెంట్స్ చేయడం, అర్థం లేని నిర్ణయాలు తీసుకోవడం.

అసలు ఓ అగ్ర రాజ్యానికి అధ్యక్షుడు ఇలాంటి ప్రవర్తనతో ఉంటారా అనిపించేలా ట్రంప్ గత కొంత కాలంగా ప్రవర్తిస్తూనే ఉన్నారు.

ఎప్పటి కప్పుడు ఆయన చేసే వ్యాఖ్యలు కొన్ని సంచలనాలు సృష్టిస్తుంటే.మరి కొన్ని మాత్రం ఆయన్ని ఇరకాటంలోకి నేట్టేస్తుంటాయి.

తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కొన్ని అమెరికన్స్ కి కోపం తెప్పించాయి.కరోనా కారణంగా ట్రంప్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళకుండా దాదాపు 3 నెలల పాటు అలానే ఉండిపోయారు.

ఇప్పుడు కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో మళ్ళీ ట్రంప్ ప్రచారానికి వెళ్తున్నారు.ఈ మేరకు ఒక్లహామా లోని టాల్సా లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బాగంగా ట్రంప్ ప్రజలని ఉద్దేశించి మాట్లాడుతూ కరోనా పరీక్షలు ఎక్కువగా చేయడం వలన ఎక్కువ కేసులు నమోదు అవుతాయని.

Advertisement

తక్కు వగా చేస్తే తక్కువ కేసులు నమోదు అవుతాయని అందుకే పరీక్షలు తక్కువగా చేయండని అధికారులకి చెప్పాను అంటూ ప్రకటించారు.

ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలతో సభలో ఉన్న కొందరు చప్పట్లతో మారు మొగించగా మరి కొందరు మాత్రం ట్రంప్ వ్యాఖ్యలకి షాక్ అయిపోయారు.అయితే అసలు ట్రంప్ నిజంగానే ఈ వ్యాఖ్యలు చేశారా లేదా సరదాగా అన్నారా అనే విషయం తెలియాల్సి ఉంది.ఇదిలాఉంటే ఇప్పటి వరకూ అమెరికాలో 23 లక్షల కేసులు నమోదు కాగా.దాదాపు 1.20 వేల మంది పైగా మృతి చెందారు.ఇంకా ఎంతో మంది ప్రజలు మృత్యువుతో కొట్టిమిట్టడుతున్నారు.

ఈ క్రమంలో ట్రంప్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడంపై అమెరికా ప్రజలు మండిపడుతున్నారు.

పాకిస్థానీ మహిళను ఉద్యోగం నుంచి తీసేసిన టెస్లా.. ఆ షాక్‌తో..??
Advertisement

తాజా వార్తలు