‘భరత్ టెన్ ప్రామిసెస్ ‘ సొంత మ్యానిఫెస్టో ప్రకటించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి
TeluguStop.com
రాజమండ్రి( Rajamahendravaram ) సెట్టింగ్ ఎమ్మెల్యే ప్రస్తుత రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ రామ్( Margani Bharath ) సొంత ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు.
రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద భారీ జన సందోహం మధ్య నగర ప్రముఖుల సమక్షంలో ' భరత్ 10 ప్రామిస్ '' పేరుతో ఈ మేనిఫెస్టోను రుడ చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా నగరంలో రౌడీ షీటర్స్, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ వంటి సంఘ విగ్రహ శక్తులను నగర బహిష్కరణ చేసి ప్రశాంతమైన నగరంగా రాజమండ్రిని ఉంచడం, వారిలో పరివర్తన వచ్చిన తరువాత మళ్లీ నగరంలోకి అనుమతించడం , నగరవాసులకు 24 గంటలు మంచినీటి సరఫరా, నగరంలోని యువతకు పదివేల ఉద్యోగ ,ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ఈ ప్రామిస్ చేస్తున్నట్లు భరత్ ప్రకటించారు.
"""/" /
అలాగే రివర్ సిటీ అందాలు చూసే విధంగా ఘాట్లను ఏకం చేయడం గోదావరిలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేయడం తన సంకల్పమని భరత్ పేర్కొన్నారు.
స్పోర్ట్స్ హబ్ గా రాజమండ్రిని తీర్చిదిద్దడం, రెండు మూడు సాఫ్ట్ వేర్ కంపెనీలు తీసుకురావడం, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంక్యుబేషన్ సెంటర్స్ తీసుకురావడం, జగనన్న కాలనీలలో 40 వేల మందికి ఇళ్లు కట్టించి లబ్ధిదారులకు అప్పగించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.
/br> """/" / అలాగే మోరంపూడి ఫ్లై ఓవర్ బ్రిడ్జి మాదిరిగా లాలాచెరువు ,పిడిం గొయ్యి, బొమ్మూరు వేమగిరి జంక్షన్ లో కూడా ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తానని భరత్( Margani Bharath ) ప్రామిస్ చేశారు.
అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మిస్తామని, ప్రతిరోజు గుడ్ మార్నింగ్ , రాజన్న రచ్చబండ కార్యక్రమాలు , వారం వారం అధికారులతో రివ్యూ నిర్వహించి ప్రజాసమస్యలు పరిష్కరిస్తారని భరత్ పేర్కొన్నారు.
సిటి ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే మీ ఇంటి పెద్ద కొడుకునై ప్రజలకు సేవలు అందిస్తానని రాజమండ్రిని విశ్వ నగరంగా అభివృద్ధి చేస్తానని
భరత్ ప్రకటించారు.
అందంగా పుట్టడమే ఈ మోడల్ తప్పయింది.. ఫ్రెండ్స్ ఏం చేశారో తెలిస్తే..