యూకేలో పెరిగిన అంత్యక్రియల ఖర్చులు.. ఎందుకో తెలిస్తే..

బ్రిటీష్ ప్రజల కష్టాలు రోజురోజుకీ మరింత తీవ్రతరం అవుతున్నాయి.ఇక్కడ జీవన వ్యయం పెరుగుదలతో పాటు, అంత్యక్రియల ఖర్చు కూడా భారీగా పెరిగి బ్రిటీష్ ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతోంది.

చాలా మంది తమ ప్రియమైనవారి భౌతిక కాయాలకు సరిగా అంతిమ మజిలీ నిర్వహించలేకపోతున్నారు.

అంత్యక్రియల ఖర్చు భరించలేక, మృతదేహాలను( Dead Bodies) అంత్యక్రియ స్థలంలోనే వదిలేయాల్సిన దుస్థితి వారికి వస్తోంది.

2021 నుంచి అంత్యక్రియల ( Funeral )ఖర్చు 3.8% పెరిగి, £9,200 (సుమారు రూ.

9.6 లక్షలు)కు చేరుకుంది.

2023లో, ఈ ఖర్చు మరింత పెరిగి, £9,658 (సుమారు రూ.10 లక్షలు)కు చేరుకుని, ఇప్పటివరకు ఎదుర్కోని అత్యధిక స్థాయికి చేరుకుంది.

"""/" / ఈ పెరుగుదలకు కారణాలు జీవన వ్యయం పెరుగుదల, వడ్డీ రేట్ల పెరుగుదల, అంత్యక్రియ సేవల ఖర్చు పెరుగుదల అని చెబుతున్నారు.

ఆసుపత్రులు మృతదేహాలను 21 రోజులకు మించి ఉంచడానికి అనుమతించవు.ఆర్థిక సహాయం పొందడానికి కఠినమైన నిబంధనలు ఉన్నాయి.

అంత్యక్రియ నిర్వాహకులు తరచుగా ముందస్తుగా సగం డబ్బు చెల్లించాలని డిమాండ్ చేస్తారు.సగటు అంత్యక్రియ ఖర్చు £4,000 (సుమారు రూ.

4 లక్షలు).ఈ కారణంగా, చాలా కుటుంబాలు తమకు నచ్చిన విధంగా అంత్యక్రియలు నిర్వహించలేకపోతున్నాయి.

"""/" / సగటున, కుటుంబాలు ఖర్చులను భరించడానికి £2,716 (సుమారు రూ.2.

8 లక్షలు) సమర్పించాలి.ప్రభుత్వ అంత్యక్రియ ఖర్చు చెల్లింపులకు కూడా అర్హత ఉన్న చాలా మంది ఈ సహాయం పొందలేకపోతున్నారు.

ఇప్పటికే అంత్యక్రియల ఖర్చు భారంతో కుంగిపోతున్న బ్రిటీష్ ప్రజలకు మరో కష్టం ఎదురైంది.

ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం అందరికీ అందుబాటులో లేదు, అర్హత ఉన్నవారికి కూడా డబ్బు రావడానికి చాలా సమయం పడుతుంది.

ప్రభుత్వం అంత్యక్రియల ఖర్చులను భరించడానికి గ్రాంట్లను అందిస్తుంది, కానీ అందరూ వాటిని పొందలేరు.

అర్హత ఉన్నవారికి కూడా, డబ్బు రావడానికి మూడు నుంచి ఆరు నెలలు పట్టవచ్చు.

ఈ జాప్యం కారణంగా, అంత్యక్రియ నిర్వాహకులకు చెల్లించడం, 21 రోజుల గడువులో మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి తీసుకురావడం కష్టతరం అవుతోంది.

చాలా కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి, దీనివల్ల కుటుంబంలో విభేదాలు వస్తూ సంబంధాలు దెబ్బతింటున్నాయి.

సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర రావు కేసులో ఏసీబీ దర్యాప్తు..!!