పాపం అనుష్కనే ఎందుకు ఇంతలా టార్గెట్‌ చేస్తున్నారు

టాలీవుడ్‌ టాప్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క వివాదాలకు చాలా దూరంగా ఉంటారు.సోషల్‌ మీడియాలో కూడా చాలా తక్కువగా ఉంటూ వస్తున్నారు.

పబ్లిక్‌ కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలో కూడా ఆమె ఎప్పుడు వివాదాస్పదంగా మాట్లాడటం కాని, వివాదాస్పదంగా డ్రస్సింగ్‌ అవ్వడం కాని జరగలేదు.కాని అనుష్క విషయంలో పుకార్లు మాత్రం ఎప్పుడూ వస్తూనే ఉన్నాయి.

ముఖ్యంగా అనుష్క పెళ్లి విషయంలో మీడియాలో పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి.గతంలో ప్రభాస్‌తో ఈమె వివాహం అంటూ వార్తలు వచ్చాయి.

ఆ తర్వాత మరొకరితో ఆ తర్వాత ఇంకొక్కరితో పెళ్లి అంటూ పుకార్లు కుప్పలు తెప్పలుగా వచ్చాయి.కాని ఇప్పటి వరకు అనుష్క మాత్రం వాటన్నింటిని కొట్టి పారేస్తూనే వచ్చింది.

Advertisement

ఇదే సమయంలో రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్‌ కోవెలమూడితో ఈమె వివాహం జరుగబోతుంది అంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే పెళ్లి అయ్యి విడాకులు తీసుకున్న ప్రకాష్‌తో అనుష్క ప్రేమలో ఉందన్న వార్తలు నిజం కాదని గతంలోనే ఆమె పేర్కొంది.అయినా కూడా మళ్లీ ప్రకాష్‌ ను వచ్చే ఏడాది అనుష్క పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.భారీ ఎత్తున ఈ వార్తలు వస్తున్న నేపథ్యంలో అంతా కూడా నిజమా అనుకుంటున్నారు.

కాని అనుష్కకు రెండవ పెళ్లి వ్యక్తిని చేసుకోవాల్సిన అవసరం లేదు.ఆయనతో అనుష్కకు పెద్దగా సంబంధం కూడా లేదు.

కనుక ఇవి పుకార్లే అంటూ అనుష్క అభిమానులు చెబుతున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?
Advertisement

తాజా వార్తలు