కరోనాపై పని చేస్తున్న డెక్సామెథాసోన్... నిర్ధారించిన ఆక్స్ ఫర్డ్ ప్రొఫెసర్

ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ ని నియంత్రించడానికి ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో ఔషధం లేదు.ఉన్నవాటిలో యాంటి బయోటెక్ మెడిసన్ మాత్రమే ఉపయోగిస్తున్నారు.

హైడ్రో క్లోరోక్వీన్ మెడిసన్ ఇండియాతో పాటు చాలా దేశాలలో ఉపయోగిస్తున్నారు.ఇంకా రెగ్యులర్ మెడిసన్ ఇస్తున్నారు.

వీటితో మరణాలా సంఖ్యని తగ్గించగలుగుతున్న పూర్తి స్థాయిలో నియంత్రించలేకపొతున్నారు.అయిన కూడా వృద్ధులు కరోనా కారణంగా ఎక్కువ సంఖ్యలో చనిపోతున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు కరోనాపై రీసెర్చ్ లు చేస్తున్న ఆక్స్ ఫర్డ్ మరో శుభవార్త చెప్పింది.సాధారణంగా అందుబాటులో ఉండే డెక్సామెథాసోన్ అనే స్టెరాయిడ్, ఈ వైరస్ పై పని చేస్తుందని తెలిపింది.

Advertisement

ఈ విషయాన్ని ముందే తాము గమనించివుంటే, బ్రిటన్ లో కనీసం ఐదువేల మంది వరకూ ప్రాణాలను కాపాడివుండేవాళ్లమని ఆక్స్ ఫర్ట్ యూనివర్శిటీ ప్రొఫెసర్ మార్టిన్ లాండ్రే తాజాగా వెల్లడించారు.బ్రిటన్ లో ఈ స్టెరాయిడ్ ను ఇచ్చి మంచి ఫలితాలను పొందామని, దీన్ని వెంటిలేటర్ పై ఉన్న రోగులకు ఇస్తే, మూడొంతుల మంది, ఆక్సిజన్ అవసరమున్న రోగులకు ఇస్తే, ఐదొంతుల మంది కోలుకున్నారని మార్టిన్ లాండ్రే తెలియజేశారు.

ఇక ఈ స్టెరాయిడ్, అతి తక్కువ ఖర్చులోనే లభిస్తుందని ఇండియాలో దాదాపు 75 రూపాయిలు త్రమే వుతుందని ఆయన అన్నారు.తాము 2,104 మందికి డెక్సామెథాసోన్ ఇచ్చామని, సత్ఫలితాలను పొందామని మార్టిన్ తెలిపారు.

ఇక ఇండియాలో దీని ప్రొడక్షన్ ఎక్కువగా ఉండటంతో మరోసారి ఈ మెడిసన్ ని ప్రపంచ ఆరోగ్య సంస్థలు ఆమోదం తెలిపితే అందరూ ఇండియా వైపు చూస్తారు.మొత్తానికి ఏ విధంగా చూసుకున్న కరోనా వైరస్ కారణంగా ప్రతి విషయంలోని ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూస్తుంది.

బెడ్‌రూమ్‌లో రాక్షసి ఉందనుకున్న చిన్నారి.. తీరా వెతికితే ఊహించని షాక్..?
Advertisement

తాజా వార్తలు