మొదట ఆరంభించిన పెద్ద హీరో పవన్‌ కళ్యాణ్‌

కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగ్స్‌ మళ్లీ ప్రారంభం కాబోతున్నాయి.ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు షూటింగ్స్‌కు అనుమతులు ఇవ్వడం జరిగింది.

ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున షూటింగ్స్‌ జరుగుతాయని అనుకుంటే కరోనా భయంతో ఇప్పటి వరకు పెద్దగా షూటింగ్స్‌ హడావుడి కనిపించలేదు.సీరియల్స్‌ షూటింగ్స్‌ అయితే ప్రారంభం అయ్యాయి కాని సినిమా షూటింగ్స్‌ మాత్రం అడపా దడపా మాత్రమే చేస్తున్నారు.

రవిబాబు తన ఓటీటీ సినిమాను తెరకెక్కిస్తుండగా నిన్నటి నుండి అన్నపూర్ణ స్టూడియోస్‌ 7 ఎకరాల సెట్స్‌లో పవన్‌ కళ్యాణ్‌ వకీల్‌ సాబ్‌ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది.పవన్‌ కళ్యాణ్‌ ఈ సినిమాను దాదాపుగా పూర్తి చేశాడు.

కేవలం 15 నుండి 20 రోజుల షూటింగ్‌ మాత్రమే బ్యాలన్స్‌ ఉంది.ఆది కూడా పూర్తి చేస్తే సినిమా పని అయిపోతుందనే ఉద్దేశ్యంతో నిర్మాత దిల్‌రాజు నిన్నటి నుండి సినిమా షూటింగ్‌ను మొదలు పెట్టించాడు.

Advertisement

మొదటి రోజు షూటింగ్‌కు పవన్‌ కళ్యాణ్‌ హాజరు కాలేదు.పవన్‌ హాజరు విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

వచ్చే వారం నుండి పవన్‌ రెండు వారాల పాటు కంటిన్యూగా షూటింగ్‌కు హాజరు అవ్వబోతున్నాడు.

జులైలో సినిమాను పూర్తి చేయాలని దిల్‌ రాజు నిర్ణయించుకున్నాడు.థియేటర్లు ఇప్పట్లో ప్రారంభం అయ్యే అవకాశం లేదు కనుక సినిమాను ఇప్పట్లో విడుదల చేసే అవకాశం లేదు.పవన్‌ కళ్యాణ్‌ ఈ సినిమాను పూర్తి చేసి క్రిష్‌ సినిమాను మొదలు పెడతాడా లేదంటే కాస్త గ్యాప్‌ తీసుకుంటాడా చూడాలి.

మొత్తానికి లాక్‌ డౌన్‌ తర్వాత షూటింగ్‌ ఆరంభించిన పెద్ద హీరో పవన్‌ కళ్యాణ్‌ గా చెప్పుకోవచ్చు.

సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!
Advertisement

తాజా వార్తలు