నిరసనల మధ్య ఘోరం..త్రుటిలో తప్పిన ప్రమాదం..!!!

అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడు హత్య అమెరికా దేశాన్ని కుదిపేస్తోంది.నిరసనలు తెలిపుతున్న ప్రాంతాలు అన్నీ కూడా కరోనా మహమ్మారి బారిన పడిన ప్రాంతాలే.

ఈ సమయంలో అధికారులకి ఒకపక్క సామాజిక దూరం పాటించపోతే కరోనా అందరికి సోకే ప్రమాదం ఉందనే భయం పట్టుకుంది.కానీ నిరసన కారులు అవేమి పట్టించుకోకుండా జార్జ్ ఫ్లాయిడ్ కి న్యాయం చేయాలని పోరాటం చేస్తూనే ఉన్నారు.

ఇదిలాఉంటే ఈ క్రమంలోనే నిరసన కారుల మధ్యకి తుపాకీ తో వచ్చిన ఓ ఉన్మాది కలకలం సృష్టించాడు.శాన్ఫ్రాన్సిస్కో లో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతి పట్ల నిరసన వ్యక్తం చేస్తున్న నిరసన కారులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు.

రాత్రి సమయంలో నిరసన కారులు నిరవధికంగా నిరసనలు తెలిపుతూనే ఉన్నారు.ఈ నిరసనలు హోరండుకున్న సమయంలోనే ఓ కారు వచ్చి అక్కడ ఆగింది.

Advertisement

కారులోంచి దిగిన ఓ నిందితుడు నిరసన కారులపై ఫైర్ చేయడం మొదలు పెట్టాడు.

దాంతో అక్కడే ఉన్న ఓ నిరసన కారుడి భుజానికి బులెట్ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు.వెంటనే పోలీసులు స్పందించడంతో కంగారుగా పారిపోతున్న అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.అతడు కారులోంచి తుపాకీ తో దిగడం స్థానికంగా ఉన్న సిసి కెమెరాలో రికార్డ్ అయ్యిందని అతడిని అరెస్ట్ చేశామని అయితే ఎందుకు ఫైర్ చేశాడు అనేది చెప్పడంలేదని అధికారులు తెలిపారు.

గాయపడిన నిరసన కారుడిని ఆసుపత్రికి తరలించారు.అయితే ఇది నిరసన కారులని భయబ్రాంతులకి గురిచేయడానికి చేస్తున్న కుట్రగా భావిస్తున్నారు నల్లజాతీయులు.

బెడ్‌రూమ్‌లో రాక్షసి ఉందనుకున్న చిన్నారి.. తీరా వెతికితే ఊహించని షాక్..?
Advertisement

తాజా వార్తలు