మహాత్ముడుని స్మరించుకున్న విజయశాంతి

ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్, నేటి కాంగ్రెస్ మహిళా నాయకురాలు

విజయశాంతి

ఈ మధ్య కాలంలో

పొలిటికల్

గా మంచి యాక్టివ్ గా ఉంటున్నారు.

కేసీఆర్

మీద విమర్శలు చేస్తూ మీడియాలో ఎప్పుడు కనిపించే విజయశాంతి తాజాగా కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తున్న పరిస్థితులపై చలించిపోయింది.

గత కొద్దిరోజులుగా తనవంతుగా మీడియా ముందుకి వచ్చి ప్రజలకి చైతన్యం కలిగించే ప్రయత్నం చేస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా మయే మహాత్మ గాంధీని స్మరించుకుంది.

నాడు మహాత్ముని మాటలు నేటి కళ్లకు కడుతున్నాయని విజయశాంతి పేర్కొన్నారు.ప్రపంచం మొత్తం విస్తరించిన

కరోనా వైరస్

తో మొత్తం అందరూ షట్ డౌన్ స్టేజిలోకి వెళ్ళిపోయారు.

దీనిని చూస్తుంటే నాడు మహాత్ముడు ప్రకృతి ప్రతి ప్రాణి ఆకలిని మాత్రమే తీర్చుతుంది, అత్యాశను కాదు అన్న మాటలు గుర్తొస్తున్నాయని విజయశాంతి సోషల్ మీడియా వేదికగా ప్రస్తావించింది.ప్రకృతి ప్రతి ప్రాణి ఆకలినీ తీర్చగలదు, అత్యాశను కాదు ఓ మహాత్మా ఓ మహర్షీ

భారతదేశపు జాతిపితా

మీరు ఆనాడు చెప్పిన భాష్యం సత్యమై వాస్తవమై ఈ రోజు అనేక దేశాలు, ప్రభుత్వాలు, అధికార వ్యవస్థలు అతలాకుతలమవుతూ అత్యాశల వ్యాపార వ్యవస్థలను మూసివేసి ఆకలి తీర్చే ప్రకృతిమాత ప్రసాదాలైన నిత్యావసరాలను ప్రజలకు అందించటానికి సతమతమవుతున్నాయి.

Advertisement

మీ ప్రవచన విలువలు భారతావనికే కాదు యావత్ ప్రపంచానికి నిత్య సుభాషితాలు అని విజయశాంతి పోస్టు చేసింది.విజయశాంతి చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు