గెలుపుపై ఎవరికీ నమ్మకం లేదా ? అందుకేనా ఈ జాగ్రత్తలు ?

హోరాహోరీగా సాగిన ఏపీ ఎన్నికల్లో గెలుపు పై ప్రతి పార్టీ పైకి ధీమా వ్యక్తం చేస్తూనే , అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నాయి.

పార్టీ శ్రేణులకు ధైర్యం నూరిపోయడానికి మెజార్టీ సీట్లు మనకే వస్తాయంటూ పదే పదే ప్రకటనలు చేస్తున్నాయి.

ఏ పార్టీకి కూడా ఇప్పటివరకు ఓటరు నాడి అంతుపట్టడంలేదు.అందుకే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఖచ్చితంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు.

టీడీపీ, వైసీపీ పార్టీలు రెండూ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.కానీ లోలోపల మాత్రం ఈ రెండు పార్టీలకూ విజయంపై పూర్తి ధీమా లేదు.

ఈ విషయంలో వైసీపీ కొంత ధైర్యంగా అధికారంలోకి వస్తామని చెప్తోంది.టీడీపీ 140 స్థానాలు గెలుస్తామని పైకి చెబుతున్నా ఎన్నికలు సరిగ్గా జరగలేదని, ఈవీఎంలలో లోపాలు ఉన్నాయని బలమైన ఆరోపణలు చేయడం ఆ పార్టీలో నెలకొన్న గందరగోళాన్ని తెలియజేస్తోంది.

Advertisement

కానీ ఫలితాలు మాత్రం ఏ పార్టీకీ ఏక పక్షంగా రాకపోవచ్చు అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.వాస్తవానికి ఎన్నికలకు ముందు పరిస్థితులు జగన్ కు అనుకూలంగా ఉన్నాయని, ఆయన భారీ విజయం సాదించబోతున్నారు అనే ప్రచారం మాత్రం జోరందుకుంది.

కాకపోతే ఎన్నికల ముందు టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆ పార్టీకి బాగా కలిసొచ్చాయనే లెక్కలు బయటకి వస్తున్నాయి.

ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు పసుపు కుంకుమ, పింఛన్ల పెంపు వంటి పథకాలు ప్రవేశపెట్టి మెజార్టీ ఓటర్లను తమ ఖాతాలో వేసుకున్నారనే లెక్కలు విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి.మొత్తంగా ఏ పార్టీకీ ఏకపక్షంగా అయితే ఫలితాలు వచ్చేలా కనిపించడంలేదు.ఒకవేళ ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాకపోతే ఏంటి పరిస్థితి అనే విషయం గురించి ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

గత అనుభవాల దృష్ట్యా టీడీపీని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదనే విషయాన్ని జగన్ బాగా గుర్తించుకున్నాడు.ఫలితాలు కొంచెం అటు ఇటుగా వస్తే కొంతమంది జంపింగ్ చేసే అవకాశం ఉంటుందని అందుకే ఎవరూ చేజారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ కీలక నాయకులకు జగన్ ఆదేశాలు జారీ చేశారట.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

టీడీపీ కూడా తమ ఎమ్యెల్యే అభ్యర్థులను కట్టుదిట్టం చేసుకునే పనిలో పడింది.

Advertisement

తాజా వార్తలు