చిరంజీవికి 32 కోట్లు ఇచ్చిన రామ్ చరణ్ .. ఎందుకు?

ఖైదీనం 150 చిత్రాన్ని 50 కోట్లలో పూర్తి చేసి ఉంటాడు రామ్ చరణ్.సినిమా థియేట్రికల్ హక్కులని దాదాపుగా 90 కోట్లకి అమ్మేసుకున్నాడు.

ఇక సాటిలైట్ హక్కులు, అవి ఇవి కలుపుకోని సినిమా బిజినెస్ వంద కోట్లను దాటేసింది.ఈరకంగా విడుదలకి ముందే చరణ్ జేబులో పెట్టిన మొత్తానికి డబుల్ డబ్బులు పడ్డాయన్నామాట.

ఇక సినిమా విడుదలై వంద కోట్ల షేర్ వసూలు చేయడంతో, పంపిణీదారులకి ఎలాంటి నష్టం పరిహారం చెల్లించాల్సిన పని పడలేదు.అంటే చరణ్ లాభాలు 50-60 కోట్ల మధ్య ఉండొచ్చు.

సినిమా తీస్తున్నప్పుడు చిరంజీవికి ఏమి ఇవ్వలేదట చరణ్.కాని సినిమాకి లాభాలు మిగిలితే మాత్రం 60% వాటా ఇస్తానన్నాడట.

Advertisement

ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ, మన మెగాస్టార్ కి 32 కోట్లు అప్పజెప్పాడట చరణ్.అదేంటి, తండ్రికి డబ్బులు ఇవ్వడం ఏంటి అని ఆశ్చర్యపోవద్దు.

తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్లుగా, తండ్రి అయినా సరే, బిజినెస్ పరంగా ఈ సినిమాకి చరణ్ నిర్మాత, చిరు హీరో.అసలు మెగాస్టార్ ఇమేజ్ వలనే కదా, సినిమా విడుదలకి ముందే చరణ్ జేబులోకి వంద కోట్లు వచ్చిపడ్డాయి.

మళ్ళీ మెగాస్టార్ స్టామినా వలనే కదా పంపిణీదారులు కూడా లాభాల్లో పడ్డారు .మరి ఆయన పేరు మీద సంపాదించుకున్నప్పుడు తగిన వాటా కూడా ఇవ్వాలి కదా.

సెట్లో బాలకృష్ణ, నాగార్జున ఎవరితో ఎలా ఉంటారో చెప్పేసిన నాగ మహేష్?
Advertisement

తాజా వార్తలు