10 సర్వేలలో 9 సర్వేలు జగన్ కే అనుకూలం.. ఏపీలో మళ్లీ వైసీపీ గెలుస్తుందా?

ఏపీలో అధికారం కోసం ఒకవైపు కూటమి మరోవైపు వైసీపీ నేతలు( YCP Leaders ) విశ్రాంతి లేకుండా కష్టపడుతున్నారు.ఏ పార్టీది అధికారమో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొనగా ఎన్నికల సమయానికి ఫలితాలు ఏ పార్టీకి అనూకలంగా ఉంటాయో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

10 సర్వేలలో 9 సర్వేలు జగన్ కే అనుకూలంగా ఉండటంతో ఏపీలో వైసీపీ మళ్లీ గెలుస్తుందా అనే చర్చలు జరుగుతుండటం గమనార్హం.నిన్న ఆత్మసాక్షి తాజాగా నాగన్న సర్వే ఫలితాలు వెలువడగా ఈ ఫలితాలు వైసీపీకే అనుకూలంగా ఉన్నాయి.

లగడపాటి రాజగోపాల్ తమ్ముడు మధు( Lagadapatti Raja Gopal Brother Madhu Survey ) నిర్వహించిన సర్వేలో సైతం వైసీపీకే అనుకూలంగా ఫలితాలు వచ్చినట్టు తెలుస్తోంది.రాయలసీమలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

నాగన్న సర్వే కోసం లక్ష కంటే ఎక్కువ శాంపిల్స్ తీసుకున్నారని సమాచారం అందుతోంది.

Advertisement

మస్తాన్ వలీ సర్వే( Mastan vali Survey )లో సైతం వైసీపీకే అనుకూలంగా ఫలితాలు వచ్చాయి.వైసీపీకి 49.51 శాతం వోట్ పర్సంటేజ్ రావచ్చని సర్వేలు వెల్లడిస్తున్నాయి.కూటమికి గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి కానీ అధికారంలోకి వచ్చే స్థాయిలో ఫలితాలు అయితే రావని సర్వేల లెక్కల ద్వారా వెల్లడవుతోంది.

కూటమి నేతలు మాత్రం తమ పార్టీకే అనుకూల ఫలితాలు వస్తాయని నమ్ముతున్నారు.

ఉమ్మడి కడప, ఉమ్మడి కర్నూలు జిల్లాలలో వైసీపీ( YCP )కే అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయని తెలుస్తోంది.రాయలసీమ ఫలితాలతో వైసీపీ మరోసారి ఏపీలో సులువుగా అధికారం చేపట్టబోతుందని తెలుస్తోంది.టీడీపీకి పూర్తిస్థాయిలో మెజారిటీ ఇచ్చే జిల్లాలు లేకపోవడం గమనార్హం.

తెలుగుదేశం( Telugudesam ) ఎన్ని హామీలు ఇస్తున్నా ఆ హామీలు ఆచరణ సాధ్యం కాదని ప్రజలు భావిస్తున్నారు.వైసీపీ గత 5 సంవత్సరాలలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయకపోయినా సంక్షేమ పథకాల అమలులో మాత్రం మంచి మార్కులు సాధించిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?

` .

Advertisement

తాజా వార్తలు