'వీరసింహారెడ్డి' 50 రోజులు పూర్తి.. ఎమోషనల్ అయిన గోపీచంద్!

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా యాక్షన్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వీరసింహారెడ్డి.

ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది.

అఖండ వంటి సూపర్ హిట్ తర్వాత బాలయ్య వీరసింహారెడ్డి సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.అందుకే నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.

అలాగే దునియా విజయ్ విలన్ రోల్ లో నటించగా వరలక్ష్మి శరత్ కుమార్ కీలక రోల్ లో నటించింది.ఇక ఈ సినిమా ఇటీవలే ఓటిటి లోకి కూడా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

Advertisement

ఓటిటిలో కూడా బాలయ్య వీరసింహారెడ్డి దుమ్ములేపుతుంది.ఇదిలా ఉండగా ఈ సినిమా 50 రోజుల సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో పూర్తి చేసుకుంది.దీంతో ఈ సినిమా డైరెక్టర్ గోపీచంద్ మలినేని సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేసారు.

ఈ సినిమా విషయంలో ఈయన ఎలా ఫీల్ అయ్యాడు అనేది పోస్ట్ ద్వారా చెప్పాడు.

గోపీచంద్ మలినేని పోస్ట్ చేస్తూ.ఒక మర్చిపోలేని అనుభూతిని.అలాగే లెక్కలేనన్ని జ్ఞాపకాలను మీరు అందించారు.

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారితో ఒక వీర మాస్ బ్లాక్ బస్టర్ ను అందుకోవడం అనేది నాకు ఒక కల లాంటిది అని బాలయ్యకు స్పెషల్ గా ధన్యవాదాలు చెబుతూ తన సంతోషాన్ని పంచుకున్నారు.ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అయ్యింది.

ఇంట్లోనే సూపర్ సిల్కీ హెయిర్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!
Advertisement

తాజా వార్తలు