ఈ 5 యాప్స్ ఉంటే మీరు రోజు ఇంట్లోంచే డబ్బు సంపాదించవచ్చు

మీ మొబైల్ ఫోన్ లో ఎన్నో యాప్స్ ఉంటాయి కదా.

సినిమాలు చూడ్డానికి కొన్ని యాప్స్, టీవి చూడ్డానికి కొన్ని యాప్స్, ఫోటోలు ఎడిట్ చేసుకోవడానికి కూడా కొన్ని యాప్స్ వాడుతుంటారు కదా.

మరి డబ్బులు సంపాదించడానికి కూడా కొన్ని యాప్స్ వాడితే తప్పేంటి ? ఇంట్లో కూర్చొనే కొన్ని ఖర్చులకి డబ్బు సంపాదించవచ్చు.ఈ 5 యాప్స్ తో అది సాధ్యపడుతుంది.

* Dream 11 :

క్రికెట్ పిచ్చి మీ అందరికి ఉంటుంది.ఆ మ్యాచ్ చూస్తూనే డబ్బు సంపాదించండి.

కేవలం వందలు కాదు, వేలు, కుదిరితే లక్షల్లో కూడా సంపాదించవచ్చు.తక్కువ డబ్బులు బెట్టింగ్ మీద పెట్టి ఎక్కువ మొత్తం పొందండి.

మీకు క్రికెట్ పరిజ్ఞానం ఉండి, ఏరోజు టీమ్ ఎలా ఆడుతుంది బేసిక్ అంచనా ఉంటే చాలు.డబ్బులే డబ్బులు.

Advertisement

అయితే ఇందులో అకౌంట్ ఉండాలంటే PAN కార్డు కంపల్సరి.అది ఉంటేనే మీ బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు పడతాయి.

* Sidejoy :

ఈ యాప్ లో మీరు రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు.అసలు ఎలాంటి కష్టం పడాల్సిన అక్కెర లేదు.

ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుంటే చాలు.కొన్ని యాడ్స్ మీ మొబైల్ లాక్ స్క్రీన్ పై ప్రత్యేక్షమవుతాయి.

యాడ్స్ ని బట్టి మీకు 1000 రూపాయల దాకా వస్తాయి.ఈ యాప్ స్పెషాలిటి ఏమిటంటే, మీరు యాడ్స్ చూడకపోయినా డబ్బులు మాత్రం వస్తాయి.

* Ladoo :

మీరు మొబైల్ రిచార్జుల కోసం జేబులోంచి రూపాయి తీయాల్సిన అవసరం లేదు.ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి విడియోలు చూడండి, ట్రైలర్స్ చూడండి, సర్వేలు పూర్తీ చేయండి.

డబ్బులు బానే అందుతాయి.అక్కడే మీరు మొబైల్ రీచార్జ్ చేసుకోవచ్చు.నెలకి సరిపడా రీచార్జ్ చేసుకోవచ్చు.

* Fronto :

ఇది కూడా అచ్చం Sidejoy లాంటి యాప్.ఇందులో కూడా మీ లాక్ స్క్రీన్ మీదకి యాడ్స్ వస్తుంటాయి.

K.K. Senthil Kumar : ఇండియాలోనే బెస్ట్ సినిమాటోగ్రాఫర్.. అతడు షాట్ తీస్తే వెండితెరకు అతుక్కుపోవాల్సిందే..

అవి ఆర్టికల్స్ కావచ్చు, సర్వేలు కావచ్చు, ఏదైనా ప్రాడక్ట్ కి సంబంధించిన సమాచారం కావచ్చు.మీరు లింక్ మీద క్లిక్ చేస్తున్నకొద్ది పాయింట్స్ వస్తుంటాయి.పాయింట్స్ పెరిగినాకొద్ది డబ్బులు కూడా వస్తుంటాయి.

* Scoopshot :

మీరు ఏదైనా పెద్ద ఈవెంట్ కి వెళ్ళారు అనుకోండి, లేదా మీ ఇంటి దగ్గరే ఏదైనా ఆసక్తికరమైన సంఘటన జరిగింది అనుకోండి, వెంటనే ఫోటోలు తీసి ఈ యాప్ లో అప్లోడ్ చేయండి.మీ ఫోటోలని మీడియావారు వాడుకుంటారు.

Advertisement

మీ ఫోటోలు ఇతరులు వాడుకుంటే మీకు డబ్బులు వస్తాయి.

తాజా వార్తలు