ఫిలిప్పీన్స్‌లో దారుణం ..భారతీయ యువకుడిని కాల్చిచంపిన దుండగుడు

ఉద్యోగం వెతుక్కుంటూ ఫిలిప్పీన్స్‌( Philippine )కు వెళ్లిన భారతీయ యువకుడిని విధి చిన్న చూపు చూసింది.ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో అతను ప్రాణాలు కోల్పోయాడు.

ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఈ దారుణం జరిగింది.మృతుడిని పంజాబ్ రాష్ట్రం కపుర్తలా జిల్లా రంధావా గ్రామానికి చెందిన 25 ఏళ్ల నిషాన్ సింగ్‌( Nishan Singh )గా గుర్తించారు.

ఇతని మరణవార్తను మనీలాకు చెందిన ఓ స్నేహితుడు నిషాన్ కుటుంబ సభ్యులకు తెలియజేశాడు.జీవితంలో గొప్పస్థాయికి చేరుకుంటాడనుకున్న కొడుకు తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

నిషాన్ మరణంతో రంధావా గ్రామంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

నిషాన్ హత్య దృశ్యాలు దగ్గరలోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యయి.అందులో నిషాన్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి టేబుల్‌పై కూర్చొని వున్నాడు.ఇంతలో బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని దుండగుడు నిషాన్‌పై పాయింట్ రేంజ్ బ్లాక్‌లో కాల్పులు జరిపాడు.

దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోగా, ఆ వెంటనే దుండగుడు బైక్‌పై పరారయ్యాడు.నిషాన్ నాలుగేళ్ల క్రితం ఉద్యోగం కోసం మనీలా( Manila )కు వెళ్లాడు.ఇంతలో ఈ దారుణం జరిగిపోయింది.

అతని మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావడానికి సాయం చేయాలని నిషాన్ కుటుంబ సభ్యులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.

నిషాన్ తల్లి రంజిత్ కౌర్ మాట్లాడుతూ.తన కొడుకంటే తనకు ప్రాణామని, తన బిడ్డ నాలుగేళ్ల క్రితం విదేశాలకు వెళ్లాడని చెప్పారు.అతనిని ఎందుకు కాల్చిచంపారో తెలియదని రంజిత్ కౌర్ అన్నారు.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

నిషాన్ మృతదేహాన్ని భారత్‌కు రప్పించడంలో సాయం చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.నిషాన్ బావమరిది జర్నైల్ సింగ్ మాట్లాడుతూ.

Advertisement

హత్య జరగడానికి గంట క్రితం తాను అతనితో మాట్లాడానని చెప్పారు.కానీ ఆ తర్వాత కొద్దిగంటల్లోనే నిషాన్ మరణించినట్లుగా తమకు సమాచారం అందిందని జర్నైల్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.

నిషాన్‌ను ఎవరు చంపారో తెలియడం లేదని, పోలీసుల నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని ఆయన చెప్పారు.

తాజా వార్తలు