అతనితో చాలా చనువుగా ఉంటున్న పవన్ కళ్యాణ్.. ఆ వ్యక్తి ఎవరో తెలుసా?

టాలీవుడ్ ప్రేక్షకులకు హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.

అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్నేహానికి ప్రాణం ఇస్తాడు అన్న విషయం మనందరికీ తెలిసిందే.ఇక టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ అయినా అలీ, పవన్ మధ్య బద్రి సినిమా నుంచి ఇప్పటివరకు ఎంతో మంచి స్నేహబంధం అనుబంధం కలిగి ఉందో మనందరికీ తెలిసిందే.

ఇక పవన్ కళ్యాణ్ కి సినీ ఇండస్ట్రీలో ఎంతో ఎంతోమంది స్నేహితులు ఉన్నారు.ఇండస్ట్రీ తో పాటు బయట కూడా ఎంతో మంది స్నేహితులు ఉన్నారు.

అలా పవన్ కళ్యాణ్ కి ఉన్న స్నేహితులలో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కూడా ఒకరు.ఆనంద్ సాయి మరెవరో కాదు తొలిప్రేమ సినిమాలో తాజ్ మహల్ సెట్ వేసి అందరితో శభాష్ అనిపించుకున్న వ్యక్తి ఆనంద్ సాయి.

Advertisement
25 Years Of True Friendship Between Pawan Kalyan And Anand Sai, Pawan Kalyan, An

ఆనంద్ సాయి తొలిప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ చెల్లెలుగా నటించిన వాసుకిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ప్రేమ సినిమా నుంచి ఇప్పటివరకు పవన్ ఆనంద్ ల మధ్య స్నేహబంధం అలాగే కొనసాగుతూనే ఉంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఆనంద్ సాయి ఉస్తాద్ భగత్ సింగ్ పూజా కార్యక్రమం లో పాల్గొన్నాడు.

25 Years Of True Friendship Between Pawan Kalyan And Anand Sai, Pawan Kalyan, An

ఆ పూజా కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఎంతో చనువుగా ఆనంద్ మీద చేయి వేసి మాట్లాడుతుండగా పవన్ సాయి చేతులు కట్టుకొని నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు.అందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.పవన్ కళ్యాణ్ ముందు చేతులు కట్టుకుని ఎంతో వినయంగా నిలబడ్డాడు ఆనంద్ సాయి.

వీరి స్నేహబంధం కి 25 ఏళ్లు పూర్తి అవుతున్నా కూడా ఇప్పటికీ అలాగే ఉండడంతో అభిమానులు వారిని చూసి మురిసిపోతూ సంతోషపడుతున్నారు.దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు అప్పట్లో ఉన్న ఫోటోని ఇప్పటి ఫోటోని కలిపి జోడించి రియల్ ఫ్రెండ్షిప్ అంటూ ట్యాగ్ చేస్తున్నారు.

ఈ రెండు ఉంటే చాలు పైసా ఖర్చు లేకుండా వైట్ అండ్ గ్లాస్ స్కిన్ ను పొందొచ్చు!
పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?

ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు