199 సినిమాలు రిలీజ్.. 26 మాత్రమే హిట్.. 2024 సంవత్సరం సక్సెస్ పర్సెంటేజ్ ఇదే!

2024 సంవత్సరం అభిమానులకు ఎంతో స్పెషల్ అనే సంగతి తెలిసిందే.

ఇతర ఇండస్ట్రీలతో పోల్చి చూస్తే మలయాళ సినీ ఇండస్ట్రీకి( Malayalam film industry ) గత కొన్నేళ్లలో ఊహించని స్థాయిలో క్రేజ్ పెరిగింది.

అయితే ఈ ఏడాది ఏకంగా 199 మలయాళ సినిమాలు రిలీజ్ కాగా ఆ సినిమాలలో హిట్టైన సినిమాలు కేవలం 26 మాత్రమే కావడం గమనార్హం.వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఈ లెక్కలు ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి.

ఈ ఏడాది మలయాళ సినిమా ఇండస్ట్రీకి ఏకంగా 700 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందట. కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ ( Kerala Film Producers )నుంచి వెలువడిన ఈ ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

ఈ ఏడాది సినిమాల కోసం 1000 కోట్ల రూపాయలు ఖర్చు కాగా కేవలం 300 కోట్ల రూపాయలు మాత్రమే తిరిగొచ్చాయని కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ చెబుతున్నారు.హీరోల రెమ్యునరేషన్లు భారీగా పెరగడం వల్లే ఆదాయం తగ్గిందని నిర్మాతలు చెబుతుండటం కొసమెరుపు.

Advertisement

ఈ ఏడాది హిట్టైన మలయాళ సినిమాలను పరిశీలిస్తే ఆ జాబితాలో మంజుమ్మల్ బాయ్స్, ఆడు జీవితం, ఏ.ఆర్.ఎం, ఆవేశం, ప్రేమలు, భ్రమయుగం, సూక్ష్మదర్శిని మరికొన్ని సినిమాలు ఉన్నాయి.మలయాళ ఇండస్ట్రీకి ఇలాంటి పరిస్థితి ఏర్పడటం ఒకింత విచిత్రమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు పెద్ద సినిమాల రీరిలీజ్ నేపథ్యంలో దేవదూతన్, మణిచిత్రతాళు సినిమాలు రీరిలీజ్ అయ్యాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం హిట్టైన సినిమాలు కేవలం 20కు అటూఇటూగా ఉండటం గమనార్హం.సినిమాలను నిర్మించే వాళ్ల సంఖ్య పెరుగుతున్నా సక్సెస్ రేట్ మాత్రం పెరగడం లేదు.టాలీవుడ్ ఇండస్ట్రీ క్రేజ్ సైతం అంతకంతకూ పెరుగుతోంది.పుష్ప ది రూల్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఏకంగా 1700 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు వచ్చాయి.2025 సంవత్సరం సినిమా ఇండస్ట్రీకి మరింత కలిసిరావాలని సినీ అభిమానులు ఫీలవుతున్నారు.

శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీపై వరుస విమర్శలు.. ఇంత నెగిటివిటీకి కారణాలివేనా?
Advertisement

తాజా వార్తలు