2022 ఆస్కార్ విజేతలు వీరే..!

ప్రపంచ చలనచిత్ర రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకునే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఎంతో అట్టహాసంగా కన్నుల పండుగగా ఎంతో ఘనంగా జరిగింది.

సిని రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన ప్రతిబావంతులను గుర్తించి ప్రతి యేటా వారికి ఇచ్చే అవార్డు ఆస్కార్ అవార్డు.

అయితే గత రెండు ఏళ్లుగా దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా రెండు సంవత్సరాలనుండి అంత హడావుడి లేకుండా ముగించేసారు.కానీ ఈ ఏడాది మాత్రం మళ్ళీ అస్కార్ అవార్డు తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంది అనే చెప్పాలి.

ఈ వేడుకలు ఎంతో అట్టహసంగా లాస్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగాయి.అలాగే 94వ ఆస్కార్ అవార్డుల వేడుకలో వివిధ విభాగాల్లో డ్యూన్‌ హవా మాములుగా లేదు అనే చెప్పాలి.

మరి ఈ ఏడాది ఆస్కార్ అవార్డు ఎంతమందిని వరించిందో తెలుసుకుందామా.ముందుగా ఉత్తమ నటుడు విషయానికి వస్తే విల్‌ స్మిత్‌ (కింగ్‌ రిచర్డ్‌)ను ఈ ఏడాది ఆస్కార్ అవార్డు వరించింది.

Advertisement

ఇకపోతే ఉత్తమ సహాయ నటి అవార్డును అరియానా డిబోస్‌( వెస్ట్‌ సైడ్‌ స్టోరీ)సొంతం చేసుకుంది.అలాగే ఉత్తమ దర్శకుడుగా జాన్‌ కాంపియన్‌ (ది పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌)కైవసం చేసుకున్నాడు.

అలాగే ఉత్తమ సహాయ నటుడు కింద ట్రాయ్‌ కాట్సర్‌(కోడా),ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌ కేటగిరిలో జెన్నీ బేవన్‌ (క్రుయెల్లా),ఉత్తమ సినిమాటోగ్రఫీ కేటగిరీలో గ్రేగ్ ఫ్రేజర్ (డ్యూన్‌),ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కింద డ్రైవ్‌ మై కార్‌ (జపాన్‌)అవార్డును సొంతం చేసుకున్నాయి.

ఇవే కాకుండా ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే విన్నర్ గా కెన్నెత్‌ బ్రనాగ్‌ (బెల్‌ఫాస్ట్‌),ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ గా బిల్లీ ఎలిష్ (నో టైమ్‌ టు డై) ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ ప్లే సియాన్‌ హెడర్‌,ఉత్తమ సౌండ్‌ కేటగిరీలో మార్క్‌ మాంగినీ, థియో గ్రీన్‌,ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌, అలాగే ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌,ఉత్తమ ప్రొడెక్షన్‌ డిజైన్‌ అనే మూడు కేటగిరీల అవార్డులను డ్యూన్ సినిమా సొంతం చేసుకుంది.ఉత్తమ డ్యాకుమెంటరీ కేటగిరీలో ది క్వీన్‌ ఆఫ్‌ బాక్సెట్‌బాల్‌ షార్ట్ ఫిల్మ్ నిలిచింది.అలాగే ఉత్తమ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ గా ది లాంగ్‌ గుడ్‌బై నిలిచింది.

ఉత్తమ ఫిల్మ్‌ ఎడిటింగ్‌ కేటగిరీలో డ్యూన్‌ సినిమా,ఉత్తమ మేకప్‌,హెయిర్‌స్టైలిష్ట్‌ కేటగిరీలో ది ఐస్‌ ఆఫ్‌ ది టామీ ఫై అస్కార్ అవార్డును పొందారు.అలాగే ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌గా ది విండ్‌షీల్డ్‌ వైపర్‌ అవార్డు సొంతం చేసుకున్నాయి.

న్యూస్ రౌండప్ టాప్ 20

కాగా ఈ సంవత్సరం ఎక్కువ అవార్డులు అమెరికన్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ గా పేరుగాంచిన డ్యూన్ సినిమాను వరించాయి.

Advertisement

తాజా వార్తలు