200+ కోట్ల‌కు పైగా బడ్జెట్ పెట్టిన సినిమాలు ..కానీ వచ్చింది ఎంత..?

ఒక‌ప్పుడు అద్భుత క‌థ‌, చ‌క్క‌టి పాట‌లు, మంచి కామెడీతో త‌క్కువ ఖ‌ర్చుతో సినిమాలు తీసేవారు ద‌ర్శ‌కులు.గాఫిక్స్‌, విజువ‌ల్ ఎఫెక్ట్స్ లేకుండా చ‌క్క‌టి చిత్రాల‌ను తెర‌కెక్కించేది.

టెక్నాల‌జీ ఫుణ్య‌మా అని ఇప్ప‌టి సినిమాల‌న్నీ గ్రాఫిక్స్ మాయాజాలంతో నిండిపోతున్నాయి.బ‌డ్జెట్ సైతం త‌డిసి మోపెడు అవుతోంది.

మేకింగ్ కాస్ట్ ను సైతం ప్రెస్టీజియ‌స్‌గా తీసుకోవ‌డం నిర్మాత‌ల‌కు ఫ్యాష‌న్ కావ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.రోబో, బాహుబ‌లి చిత్రాల‌తో భారీగా పెట్టుబ‌డులు పెట్టి సినిమాలు తీస్తున్నారు ప్రొడ్యూస‌ర్లు.టాలీవుడ్‌, బాలీవుడ్ సినిమాల్లో రూ.200 కోట్ల‌కు పైగా బడ్జెట్ పెట్టి ప‌లు సినిమాలు తెర‌కెక్కాయి.ఇందులో కొన్ని చిత్రాలు మంచి వ‌సూళ్లు సాధిస్తే.

మ‌రికొన్ని పెట్టుబ‌డి కూడా రాబ‌ట్ట‌లేక‌పోయాయి.ఇంత‌కీ 200 కోట్ల‌కు పైగా ఖ‌ర్చుతో రూపొందిన సినిమాలేంటి? ఆయా చిత్రాల క‌లెక్ష‌న్లు ఎంత‌? అనేది ఇప్పుడు తెలుసుకుందాం!

రోబో 2.0

200 Crores Budget Invested Movies Collections, Robot 2.0,saho, Sye Raa Narasimha
Advertisement
200 Crores Budget Invested Movies Collections, Robot 2.0,Saho, Sye Raa Narasimha

ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే ఈ సినిమా అత్య‌ధిక బ‌డ్జెట్‌తో రూపొందింది.శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో 570 కోట్లతో ఈ సినిమా తీశారు.వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 800 కోట్లు సాధించింది.

సాహో

200 Crores Budget Invested Movies Collections, Robot 2.0,saho, Sye Raa Narasimha

ప్ర‌భాస్ హీరోగా ఈ సినిమా 350 కోట్లు పెట్టి తీశారు.ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా 435 కోట్ల రూపాయ‌లు వ‌సూలు చేసింది.

సై రా

చిరంజీవి హీరోగా రూపొందిన ఈ సినిమా బడ్జెట్ 270 కోట్ల రూపాయ‌లు.అయితే వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 240 కోట్లు మాత్ర‌మే సాధించింది.నిర్మాత‌ల‌కు పెద్ద దెబ్బ కొట్టింది.

బాహుబలి-2

ఇండియ‌న్ సినిమా స్థాయిని హాలీవుడ్ రేంజికి తీసుకెళ్లిన ఈ సినిమా బ‌డ్జెట్ 250 కోట్లు.ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ వ‌సూళ్ల‌ను చేప‌ట్టింది.రాజ‌మౌళి రూపొందించిన ఈ సినిమా 1,810 కోట్లు సాధించింది.

థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

ఈ సినిమా నిర్మాణానికి 220 కోట్లు ఖ‌ర్చు చేశారు.వరల్డ్ వైడ్ గా 330 కోట్లు సాధించింది.

పద్మావత్

Advertisement

దీపికా ప‌దుకునే, ర‌ణ్‌వీర్ హీరో, హీరోయిన్లుగా రూపొందిన ఈ సినిమా బడ్జెట్ 215 కోట్లు.ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా 585 కోట్లు సాధించింది.

టైగర్ జిందా హై

ఈసినిమాను 210 కోట్లుతో రూపొందించ‌గా.565 కోట్లు సాధించింది.

దర్బార్

ఈ సినిమాను 200 కోట్లతో తెర‌కెక్కించ‌గా.వరల్డ్ వైడ్ గా 220 కోట్లు సాధించింది.

జీరో

ఈ బాలీవుడ్ సినిమాను 200 కోట్లు పెట్టి తీయ‌గా.కేవ‌లం 191 కోట్ల రూపాయ‌లు మాత్ర‌మే సాధించింది.

తాజా వార్తలు