కోరమాండల్ ఎక్స్‎ప్రెస్ లో 178 మంది ఏపీ ప్రయాణికులు.. వాల్తేరు డీఆర్ఎం

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో ఏపీకి చెందిన ప్రయాణికులు 178 మంది ఉన్నారని వాల్తేరు డీఆర్ఎం తెలిపారు.

వంద మందికి పైగా విశాఖకు రిజర్వేషన్ ను కలిగి ఉన్నారన్నారు.

అయితే జనరల్ బోగీలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనేది తెలియాల్సి ఉందని చెప్పారు.కాగా బాలాసోర్ నుంచి మరో రెండు గంటల్లో ప్రత్యేక రైలు వస్తుందని వెల్లడించారు.

అదేవిధంగా విశాఖ నుంచి మరమ్మతు సిబ్బందితో ఒక రైలు బాలాసోర్ వెళుతోందన్నారు.యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ లో ఏపీ ప్రయాణికులు ఉన్నారో తేలాల్సి ఉందని డీఆర్ఎం వెల్లడించారు.

అసలు శ్రీ లలితా దేవికి చరిత్ర ఉన్నదా?
Advertisement

తాజా వార్తలు