బస్సు లగేజీ బాక్సులో 15 అడుగుల పైథాన్, ఎక్కడి నుంచి వచ్చిందిరో బాబు!

ఈ మధ్య తరచుగా పెద్ద పెద్ద పాములు కలకలం సృష్టించడం చూస్తూనే ఉన్నాం.ద్విచక్రవాహనాలు, ఇళ్లు, బస్సులు, ఆఫీసులు, ఆస్పత్రులు.

ఇలా ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ.ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.

పాము అన్న పేరు వినగానే పదడుగుల దూరం పరిగెట్టే వాళ్లకు కనిపిస్తూ.తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాయి.

మొన్నటికి మొన్న ఆర్టీసీ బస్ డ్రైవర్ ఇంజిన్ వద్ద ఓ పెద్ద పాము కనిపించగా.తాజాగా అలాంటి ఘటనే మరో చోట చోటు చేసుకుంది.

Advertisement
15 Feet Python Found In Trunk Of Roadways Bus In Uttar Pradesh , 15 Feet Python

ఇక్కడ కూడా ఓ పదిహేను అడుగుల పాము బస్సులో కలకలం సృష్టించింది.లగేజీ పెట్టే బాక్సులో దూరి వెచ్చగా బజ్జుంది.

సామాన్లు పెట్టాలని దాన్ని తెరిచిన బస్సు డ్రైవర్ కు ఈ పాము కనిపించగా.తెగ భయపడిపోయాడు.

అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

15 Feet Python Found In Trunk Of Roadways Bus In Uttar Pradesh , 15 Feet Python

ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లోని ఓ బస్సులో 15 అడుగుల పైధాన్ కలకలం సృష్టించింది.సివిల్ లైన్స్ బస్టాండ్ వద్ద ఈగి ఉన్న బస్సు లగేజి బాక్సులోకి పైధాన్ చొరబడింది.ఇది గమనించిన బస్సు డ్రైవర్.

Red Eyes : కళ్లు ఎర్రగా ఉండడం ఏ వ్యాధి లక్షణమో తెలుసా..?

అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు తీవ్రంగా శ్రమించి పామును పట్టుకున్నారు.

Advertisement

లగేజి బాక్సులోకి భఆరీ కొండ చిలువ చొరబడటం పై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.అసలీ పాము అక్కడికెలా వెళ్లిందబ్బా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇంత పెద్ద పాము.బయట చలికి తట్టుకోలేకే బస్సులో దూరి వెచ్చగా పడుకొని ఉండొచ్చంటూ మరికొందరు చెబుతున్నారు.

తాజా వార్తలు