130 ఏళ్ల నాటి కుర్చీని రెండురకాలుగా వాడుకోవచ్చు.. అప్పట్లోనే క్రియేటివిటీ!

ఇప్పుడంటే మల్టీ పర్పస్ ఫర్నిచర్ తయారు చేసేస్తున్నారు కానీ, అదేవిధంగా దాదాపు 130 ఏళ్ల కిందట కూడా తయారు చేసేవారు అంటే మీరు నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే.

అదొక కుర్చీ.

( Chair ) అది చూడడానికి అచ్చం ఓ కుర్చీలాగే ఉంటుంది.కానీ దానిని ఓపెన్ చేస్తే మాత్రం స్టెప్స్( Steps ) మాదిరి తయారైపోతుంది.

అది చూడడానికి కూడా చాలా అందంగా వుంది.దాని సహాయంతో చిన్న చిన్న ఎత్తులు చాలా తేలికగా ఎక్కేయొచ్చు.

కుర్చీలో దర్జాగా గంటలు గంటలు కూర్చోవచ్చు కూడా.అంత కంఫర్ట్ గా ఉంటుంది మరి.

Advertisement

దీనిని చూసాక మనకి దానిని తయారు చేసిన కళాకారుడుని మెచ్చుకోకుండా ఉండలేము.అయితే ఆ కళాకారుడిని( Artist ) చూడడం ఎవరి తరమూ కాదు.ఎందుకంటే తరాలు మారిపోయాయి కనుక.

కాగా ఈ వినూత్న కుర్చీని రాఘవేంద్ర సర్వం అనే వ్యక్తి ట్విట్టర్ లో పోస్ట్ చేయగా ప్రస్తుతం దానికి సంబందించిన వీడియో విపరీతంగా నెటిజన్లను ఆకట్టుకుంటోంది.ఇక ఆయన ఈ కుర్చీ గురించి చెబుతూ ఇది హైదరాబాద్ సంస్థానాన్ని ఎన్నో ఏళ్లు పాలించిన నిజాం నవాబుల( Nizam ) నాటి కుర్చీ అని దీనికి 130 ఏళ్ల చరిత్ర ఉందని చెబుతున్నారు రాఘవేంద్ర సర్వం.

అప్పట్లో నిజాం రాజులు వైభవానికి పెట్టింది పేరు.వారి ప్రతీ పేలస్ లో ఇలాంటివి కోకొల్లలుగా ఉండేవట.వాటిపైనే వారు ఎక్కువగా సేదతీరేవారట.

ఇంకా అలా వినూత్నంగా చేసే వస్తువులు వారి మనసుని దోచేవట.అందుకే వాటిని తయారు చేసిన కళాకారులకు వారు కోకొల్లలుగా కానుకలు ఇచ్చేవారని ప్రతీతి.

నరదిష్టి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

కాగా 130 ఏళ్ల నాటి ఈ కుర్చీని మడిస్తే మెట్లలా ఎలా మారిపోతోందో.అచ్చం వాటిని పోలినవి ఇపుడు మనకు మార్కెట్లో కూడా లభిస్తున్నాయని చెబుతున్నారు.

Advertisement

అయితే వాటికి రిఫరెన్స్ మాత్రం అవేనట మరి.

తాజా వార్తలు