ఏపీలో మొదలైన పదో తరగతి పరీక్షలు..

ఏపీలో పదో తరగతి పరీక్షలు( 10th class exams ) మొదలయ్యాయి.ఉదయం 9:30 గంటల నుంచి 12:45 గంటల వరకు పరీక్ష జరుగనుంది.

నేటి నుంచి ఈనెల 30వరకు పరీక్షలు జరుగనున్నాయి.

మొత్తం 7,25,620 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు.వారిలో రెగ్యులర్‌ విద్యార్థులు 6,23,092 మంది, రీఎన్‌రోల్‌ అయినవారు 1,02,528 మంది ఉన్నారు.రెగ్యులర్‌ విద్యార్థుల్లో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు ఉన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 3,473 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.బస్సుల్లో హాల్‌టికెట్లు చూపించి విద్యార్థులు ఉచితంగా పరీక్షా కేంద్రాలకు( Examination centers ) చేరుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ తెలిపింది.

వైరల్ వీడియో : మాజీ ప్రియుడి పెళ్లిలో ప్రియురాలు ఎంట్రీ.. చివరకు ఏం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు