కేవలం ఆ ఒక్క ప్రాంతం నుండే 100 కోట్లు..'సలార్' ని భారీ మార్జిన్ తో కొట్టిన 'పుష్ప : ది రూల్'

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ ని పుష్ప ( pushpa )సినిమాకి ముందు , పుష్ప సినిమాకి తర్వాత అని విభజించడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

అల్లు అర్జున్ ( Allu Arjun )మాత్రమే కాదు, మూవీ యూనిట్ మొత్తం లో ఎవ్వరూ కూడా పుష్ప సినిమా జాతీయ స్థాయిలో అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని ఊహించలేదు.

తెలుగు లో కంటే కూడా ఈ సినిమాకి బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. గోల్డ్ మైన్ ఎంటర్టైన్మెంట్స్( Gold Mine Entertainments ) అనే సంస్థ కేవలం యూట్యూబ్ కి మాత్రమే అప్పట్లో పరిమితం లాగ ఉండేది.

తెలుగు మరియు తమిళ సినిమాలను హిందీ లో దబ్ చేసి తన యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేసుకుంటూ ఉంటాడు.అతని ఛానల్ లో అందరికంటే అత్యధిక వ్యూస్ అల్లు అర్జున్ సినిమాలకే వచ్చేవి, ఆయన సినిమాల ద్వారానే కోటీశ్వరుడు అయ్యాడు.

ఏది అయితే అది అవ్వుద్ది అని రిస్క్ చేసి పుష్ప సినిమాని కొన్నాడు, వంద కోట్ల రూపాయిలను సంచిలో వేసుకున్నాడు.

100 Crores From That One Area Alone pushpa The Rule Beat salar By A Huge Mar
Advertisement
100 Crores From That One Area Alone 'Pushpa The Rule' Beat 'Salar' By A Huge Mar

అంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ అంటే ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో మనం ఊహించగలం.ఆ క్రేజ్ కి ఉదాహరణగా ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని చూపించొచ్చు.ఈ సినిమాకి సంబంధించిన ఆంధ్ర ప్రదేశ్ థియేట్రికల్ రైట్స్ వంద కోట్ల రూపాయలకు పలుకుతుందట.

దాదాపుగా #RRR రేంజ్ బిజినెస్ అన్నమాట.ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన సలార్( Salar ) చిత్రానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో దాదాపుగా 82 కోట్ల రూపాయలకు జరిగింది.

పుష్ప సినిమాకి వంద కోట్లు అంటే, ఏ రేంజ్ మార్జిన్ అనేది మీరే చూడండి.కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుండే ఈ సినిమాకి 200 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగే అవకాశం ఉంది.

ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ఓవర్సీస్ రైట్స్ అక్షరాలా 90 కోట్ల రూపాయలకు పలుకుతుందట.

100 Crores From That One Area Alone pushpa The Rule Beat salar By A Huge Mar
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

ఇక్కడ కూడా దాదాపుగా #RRR రేంజ్ బిజినెస్ అన్నమాట.ఇక ఈ చిత్రానికి అత్యధిక క్రేజ్ ఉన్న హిందీ ప్రాంతం గురించి మాట్లాడుకోవాలి.ఈ సినిమాకి సంబంధించిన హిందీ రైట్స్ 200 కోట్ల రూపాయిలు పలుకుతుందట.

Advertisement

అలా కేవలం ఈ మూడు ప్రాంతాల నుండే 500 కోట్లు.ఇవి కాకుండా డిజిటల్ రైట్స్ , ఆడియో రైట్స్, సాటిలైట్ రైట్స్ ఇలా అన్నీ కలిపితే 800 కోట్లు దాటేసింది.

విడుదలకు ముందే 800 కోట్ల రూపాయిల బిజినెస్ ఈ సినిమాకి జరిగింది అన్నమాట.అల్లు అర్జున్ తన సినిమాకి ఈ రేంజ్ బిజినెస్ జరుగుతుందని కలలో కూడా ఊహించి ఉండదు.

తాజా వార్తలు