'గ్యాంగ్‌ లీడర్‌' టీజర్‌ను చూస్తే ఏమనిపిస్తుందంటే..!

నాని ఈమద్యే జెర్సీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

ఆ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు నానిపై విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

నాని నటనకు జెర్సీ చిత్రం పీక్స్‌ అంటూ ప్రశంసలు పొందాడు.తాజాగా మరో సినిమాతో నాని రెడీ అయిపోయాడు.

విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న గ్యాంగ్‌ లీడర్‌ చిత్రంను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.మొదట ఈ చిత్రంను ఆగస్టు 30న అనుకున్నా కూడా కొన్ని కారణాల వల్ల సినిమాను సెప్టెంబర్‌ రెండవ వారంలోకి వాయిదా వేశారు.

సినిమా విడుదలకు సమయం ఉన్నా కూడా ప్రమోషన్‌ కార్యక్రమాలు మొదలు పెట్టారు.తాజాగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు.ఈ చిత్రం గురించి మొదటి నుండి ప్రచారం జరిగినట్లుగానే ఆడవారి గ్యాంగ్‌ తరపున నాని పోరాడతాడు.

Advertisement

ఒక అయిదుగురు గ్యాంగ్‌ అయిన లేడీస్‌కు నాని ఏ విధంగా సాయం చేశాడు అనేది ఈ టీజర్‌ను చూస్తుంటే అర్థం అవుతుంది.నాని ఈ చిత్రంలో పెన్సిల్‌ అంటూ పిలవబడతాడు.

ఎందుకు పెన్సిల్‌ అని పిలవబడుతున్నాడు అనేది ఆ తర్వాత తెలుస్తుంది.సినిమా విడుదల విషయమై త్వరలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

ఈ చిత్రం ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని టీజర్‌ను చూస్తుంటే అనిపిస్తుంది.ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమాలను నాని ఏ స్థాయిలో పండిస్తాడో భలే భలే మగాడివోయ్‌ చిత్రంతో వెళ్లడయ్యింది.

అందుకే ఈ చిత్రంతో మరో సక్సెస్‌ను నాని దక్కించుకుంటాడేమో అంటూ టీజర్‌ చూసిన ప్రతి ఒక్కరు అంటున్నారు.కింద టీజర్‌ను చూసి మీరేమంటారో మాకు చెప్పండి. .

Casa Pariurilor : Spielerschutz Und Verantwortungsvolles S...
Advertisement