భీమ్ దీక్షలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

సూర్యాపేట జిల్లా:మహనీయుల త్యాగాలను స్మరిస్తూ వారి మార్గంలో నడవాలని,మార్చి 15 నుండి ఏప్రిల్ 14 వరకు పవిత్రమైన మాసంగా భావిస్తూ దీక్ష తీసుకున్న ప్రతి ఒక్కరూ పవిత్రమైన జీవన విధానాన్ని గడపాలని,అక్షరం,ఆర్థికం,ఆరోగ్యం మరియు రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ప్రయాణించాలని,అలాగే రాజ్యాంగ రక్షణ-ఓటు హక్కు పరిరక్షణకై పూనుకోవాలని బిఎస్పి తెలంగాణ స్టేట్ కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు.

మంగళవారం సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నాగారం మండలం ఫణిగిరి గ్రామంలో మహనీయుల జయంతి ఉత్సవాల మాసం సందర్భంగా స్వేరో అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన భీమ్ దీక్ష కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో భీమ్ దీక్ష చీప్ కన్వీనర్ పొడపంగి రాధా,గ్రామ సర్పంచ్ గట్టు నరసింహారావు,నిర్వహణ కన్వీనర్ మిర్యాల మధు, కొండగడుపుల ఎల్లయ్య,పిడమర్తి శీను,ముత్యాల కిషన్,మహేంద్రనాథ్,ఎర్ర రాంబాబు,అందే సంజీవ, ఎల్లయ్య,కృష్ణ,నరసింహ,పందిరి రవికుమార్, కమటంశోభ,నవీన్,అంకెపాక శ్రీనివాస్,స్వేరో అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు,జిల్లా ఇన్చార్జిలు తదితరులు పాల్గొన్నారు.

పిఠాపురంలో స్థలం కొనుగోలు చేసిన స్టార్ హీరో పవన్ కళ్యాణ్.. ఎన్ని ఎకరాలంటే?

తాజా వార్తలు