పెంచిన పెట్రోల్,డీజిల్,గ్యాస్,విద్యుత్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలి

నల్లగొండ జిల్లా:కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్,డీజిల్,విద్యుత్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని,ప్రజలకు అండగా వుండాల్సిన ప్రభుత్వాలు ప్రజల నడ్డి విరిసే ప్రయత్నాలు మానుకోవాలని సమాచార హక్కు ప్రజా చైతన్య సమితి నల్గొండ జిల్లా ఇంఛార్జ్ మరియు వినియోగదారుల చట్టం నల్లగొండ జిల్లా జాయింట్ సెక్రెటరీ మహమ్మద్ నజీర్ డిమాండ్ చేశారు.

ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా కష్టకాలం నుండి ఇప్పుడు ఇప్పుడే కోలుకుంటున్న పేద,మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్,వంట గ్యాస్ లపై భారం మోపి ప్రజలను దోచుకుంటుంటే,రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు చేయడం సిగ్గు చేటన్నారు.

పెట్రోల్,డీజిల్,వంటగ్యాస్ లలో రాష్ట్ర ప్రభుత్వం పన్నుల వాటా తగ్గించి,రాష్ట్ర ప్రజలకు న్యాయం చేసే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఎందుకు ఆ దిశగా అడుగులు వేయడం లేదని ప్రశ్నించారు.పెరిగిన ధరలతో ప్రజలు ఆందోళన చెందుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచడం బాధాకరమన్నారు.

పైగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ధరలు పెంచడం వలన సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని పాలన సాగిస్తున్నట్లుగా వుందని, ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరలను తగ్గించకపోతే ప్రజలు ప్రభుత్వాలపై తిరిగపడే పరిస్థితి వస్తుందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జావిద్, మహేష్,జీశాన్,యాసర్,సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
నల్లగొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై నెగ్గిన అవిశ్వాస...!

తాజా వార్తలు