నల్లని పాదాలను వదిలించుకోవటానికి ఇంటి నివారణలు

అందమైన పాదాలు తేమ, చెమట, ప్రతి రోజు ఎక్కువగా నడవటం, సూర్యరశ్మి వంటి కారణాల వలన నల్లని పాదాలుగా మారతాయి.

పాదాలు నల్లగా ఉంటే మనకు ఇష్టమైన బూట్లు మరియు చెప్పులు వేసుకోవటానికి కొంచెం కష్టం అవుతుంది.

అప్పుడు నడవటానికి ఇబ్బందిగా ఉంటుంది.సూర్యకాంతి నేరుగా పడటం వలన మృత కణాలు మరియు పొడి కారణంగా పాదాలు సహజ రంగును కోల్పోతాయి.

ఇప్పుడు సహజంగా, కేవలం ఒక వారం రోజుల్లోనే ఇంటి నివారణలతో ఈ సమస్య నుండి బయట పడవచ్చు.ఇక్కడ నల్లని పాదాలను వదిలించుకోవటానికి కొన్ని సహజ నివారణలు ఉన్నాయి.

ఆపిల్ సైడర్ వినెగర్ ఆపిల్ సైడర్ వినెగర్ ని దాదాపుగా అన్ని రకాల చర్మ సమస్యలకు ఉపయోగిస్తారు.దీనిలో విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్దిగా ఉండుట వలన పాదాల నలుపు తగ్గించటంలో సహాయపడుతుంది.

Advertisement

అలాగే స్పష్టమైన మరియు మెరిసే చర్మాన్ని ఇస్తుంది.కావలసినవి ఆపిల్ సైడర్ వినెగర్ - 1 స్పూన్ నీరు - 1 స్పూన్ పద్దతి * మొదట పాదాలను శుభ్రంగా కడగాలి.

ఒక బౌల్ లో ఆపిల్ సైడర్ వినెగర్ మరియు నీటిని వేసి బాగా కలపాలి.* ఈ మిశ్రమాన్ని కాటన్ బాల్ సాయంతో పాదాలకు రాయాలి.

* 20 నిముషాలు అయ్యిన తర్వాత చల్లని నీటితో పాదాలను శుభ్రం చేయాలి.* ప్రతి రోజు ఈ విధంగా చేసిన తర్వాత, పాదాలను శుభ్రంగా పొడి వస్త్రంతో తుడిచి మాయిశ్చరైజర్ రాయాలి.

ఆలివ్ నూనె మరియు చక్కెర ఆలివ్ నూనె మరియు చక్కెర రెండు కూడా నల్లని పాదాలు మరియు చనిపోయిన చర్మ కణాలను వదిలించుకోవటం కొరకు ఉత్తమంగా పనిచేస్తాయి.కావలసినవి ఆలివ్ నూనె - 2 స్పూన్స్ చక్కెర - 1 స్పూన్ నిమ్మరసం - అరస్పూన్ పద్దతి * మొదట పాదాలను గోరువెచ్చని నీటిలో 10 నిముషాలు ఉంచి, ఆ తర్వాత పొడి వస్త్రంతో పొడిగా తుడవాలి.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
వాళ్లకు క్షమాపణలు చెప్పిన సంక్రాంతికి వస్తున్నాం బుల్లిరాజు.. అసలేం జరిగిందంటే?

* ఒక బౌల్ లో ఆలివ్ నూనె, చక్కెర, నిమ్మరసం వేసి బాగా కలపాలి.* ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసి 5 నుంచి 6 నిమిషాల వరకు మసాజ్ చేయాలి.

Advertisement

* ఆ తర్వాత 5 నిముషాలు అలా వదిలేసి పాదాలను శుభ్రంగా కడగాలి.బేకింగ్ సోడా మరియు పాలు చర్మం మృదువుగా కావటానికి ఏమి కావాలి? కఠినమైన పాదాలు మృదువుగా మారాలంటే ఏమి కావాలి? బేకింగ్ సోడా మరియు పాలు అనేవి పాదాలను మృదువుగా చేయటానికి సహాయపడతాయి.కావలసినవి బేకింగ్ సోడా - 1 స్పూన్ పాలు - 3 లేదా 4 స్పూన్స్ పద్దతి * మొదట పాదాలను శుభ్రం చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్ లో బేకింగ్ సోడా మరియు పాలను వేసి బాగా కలపాలి.* ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసి వేగంగా రబ్ చేయాలి.* పది నిముషాలు అయ్యిన తర్వాత పాదాలను శుభ్రంగా కడగాలి.

* ఆ తర్వాత కాటన్ వస్త్రంతో పాదాలను పొడిగా తుడిచి మాయిశ్చరైజర్ రాయాలి.

తాజా వార్తలు