ఆన్‌లైన్ డేటింగ్ ఉచ్చుకు దూరంగా ఉండాలంటే ఇలా చేయాలి..

గత కొన్నేళ్లుగా ఆన్‌లైన్ డేటింగ్ ట్రెండ్ పెరిగింది.ఈ ధోరణితో మోసాలు కూడా చోటు చేసుకుంటున్నాయి.

వాటి వ‌ల‌లో ప‌డ‌కూడ‌దంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.ఆన్‌లైన్ లావాదేవీలను మానుకోండి: ఇలాంటి కేసుల ఉద్దేశం మోసం చేసి డబ్బులు దండు కోవడమే.కాబట్టి ఈ తరహా డేటింగ్‌లో ఆన్‌లైన్ లావాదేవీలు చేయ కూడదని గుర్తుంచు కోండి.

ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌ల వంటి ప్లాట్‌ ఫారమ్‌లలో ఆన్‌లైన్ లావాదేవీలు చేస్తున్నప్పుడు డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ వివరాలు కోరుతారు.ఇది హ్యాకర్‌లకు.వినియోగ దారుల నుంచి డబ్బును కాజేసేందుకు ఇది సువర్ణావకాశంగా మారుతుందని GadgetsNow నివేదిక చెబుతోంది.

డిజిటల్ గిఫ్ట్ కార్డ్‌లను వాడొద్దు .నివేదిక ప్రకారం, మోసపూరిత హ్యాకర్లు ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌ల పేరుతో డిజిటల్ గిఫ్ట్ కార్డ్‌లను పంపుతారు.అటువంటి కార్డును అంగీకరించడం ద్వారా వినియోగదారు వివరాలు స్కామర్‌లకు చేరతాయి.

Advertisement

సోషల్ మీడియా ప్లాట్‌ ఫారమ్‌పై అప్రమత్తం .ఇలాంటి మోసాలకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.అందుకే ముందుగా మీ సోషల్ మీడియా ప్రొఫైల్‌ను లాక్ చేయండి.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేయబడిన ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లకు సంబంధించిన లింక్‌లపై అస్సలు క్లిక్ చేయవద్దు మోసాన్ని నివారించండి.మోసగాళ్లు మాట్లాడే సాకుతో మొబైల్ నంబర్లను షేర్ చేయమని హ్యాకర్లను అడుగుతారని గుర్తుంచుకోండి.

సంభాషణ ప్రారంభమైనప్పుడు, వారు తమ భావోద్వేగ కథను చెబుతారు.వివిధ పథకాలలో పెట్టుబడి పెట్టడానికి ఒప్పిస్తారు.

ఇలాంటివారికి స‌హ‌క‌రించ‌కండి.హ్యాకర్ల ఫోటోలను చెక్ చేయండి .హ్యాకర్ల ఫొటోల‌ను చెక్‌ చేయడం అవసరం.ప్రొఫైల్‌లో ఉన్న ఫోటోను గూగుల్‌లో రివర్స్ సెర్చ్ చేయండి.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
పుత్రికోత్సాహంలో జగన్.. మమ్మల్ని ఎంతో గర్వపడేలా చేసావంటూ ట్వీట్

ఇలా చేయడం ద్వారా ఎదుటి వ్యక్తి హ్యాకర్ లేదా సాధారణ వ్యక్తి అనేది స్పష్టంగా తెలుసుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు