అతడికి భారత్ తరుపున క్రికెట్ ఆడాలని కోరిక, కానీ నేడు ప్రత్యర్థిగా బరిలోకి దిగాడు!

ఉన్ముక్త్​ చంద్​. అంటే తెలియని నేటితరం క్రికెట్ క్రీడాభిమానులు ఉండరనే చెప్పుకోవాలి.

టీమిండియా అండర్​-19 మాజీ కెప్టెన్ అయిన ఇతగాడిని క్రికెట్​ అభిమానులకు అంతత్వరగా మర్చిపోలేరు.2012 అండర్​ 19 ప్రపంచకప్​లో భారత్​ను విజేతగా నిలిపిన ఘనత ఈ యువ సారథి సొంతం.దాని తరువాత కొన్ని అనూహ్య కారణాల వలన 28 ఏళ్లకే భారత క్రికెట్​కు వీడ్కోలు పలికి అందరిని విస్మయానికి గురి చేశాడు.

ఇక టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాలని కలలు కన్న ఉన్ముక్త్​. ఇప్పుడు భారత జట్టుకు ప్రత్యర్థిగా బరిలోకి దిగడం కొసమెరుపు.అవును.అతగాడు భారత జట్టుకు ప్రత్యర్థిగా దిగే అవకాశాన్ని తాజాగా సొంతం చేసుకోనున్నాడు.2024 T20 ప్రపంచకప్​ ఆతిథ్య హక్కులను వెస్టిండిస్​తో పాటు అమెరికా సైతం దక్కించుకున్న విషయం మనందరికీ తెలిసినదే.దీంతో USA జాతీయ జట్టుతో కొనసాగుతున్న ఉన్ముక్త్​కు ఈ అరుదైన అవకాశం దక్కనుంది.

ఇక ICC, 2024 T20 ప్రపంచ కప్​ టోర్నీని వెస్టిండిస్​తో పాటు అమెరికాలోనూ నిర్వహించాలని నిర్ణయించింది.క్రికెట్​కు విశ్వవ్యాప్తంగా ఆదరణ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణం తీసుకున్నట్లు వెల్లడించింది.

ఈ క్రమంలో ICC తీసుకున్న ఈ నిర్ణయంతో హోస్ట్​ కంట్రీ హోదాలో USA మొదటిసారి మెగా టోర్నీకి అర్హత సాధించడం విశేషం.

Unmukt Chand To Play Against India In 2024 T20 World Cup Details, Indian, Crick
Advertisement
Unmukt Chand To Play Against India In 2024 T20 World Cup Details, Indian, Crick

దీంతో ఆ దేశ జాతీయ జట్టుకు ఆడుతున్న ఉన్ముక్త్​.టీమిండియాకు ప్రత్యర్థిగా బరిలోకి దిగే అవకాశం మెండుగా వుంది.అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ మరో విషయం ఏమంటే, టీమిండియా అండర్​ 19 మాజీ సారథి ఉన్ముక్త్​తో పాటు తమ సొంత జట్లపై ప్రత్యర్థి హోదాలో బరిలోకి పలువురు క్రికెటర్లు దిగనున్నారు.

అందులో ప్రస్తుతం USA తరఫున క్రికెట్​ ఆడుతున్న కోరే అండర్సన్​ - న్యూజిలాండ్, లియామ్​ ప్లంకెట్ - ఇంగ్లాండ్​, జుయాన్​ థెరాన్ -దక్షిణాఫ్రికా, సమీ అస్లాం - పాకిస్థాన్ లు ఉన్నారు.ఇంకా మరికొంతమంది వుండే అవకాశం వుంది.

Advertisement

తాజా వార్తలు