టాలీవుడ్ ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి మనందరికీ తెలిసిందే.ఆయన సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో తుదిశ్వాస విడిచారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణవార్తతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది.ఆయన మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
తాజాగా దర్శకుడు రాజమౌళి సిరివెన్నెలని తలుచుకొని ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.1996లో రాజమౌళి మేము అర్ధాంగి అనే సినిమాతో సంపాదించుకున్న డబ్బు, పేరు అని కూడా పోయాయట.ఆ తర్వాత వచ్చే నెల ఇంటి అద్దె ఎలా కట్టాలో తెలియని పరిస్థితి, అటువంటి పరిస్థితులలో నాకు ధైర్యాన్ని ఇచ్చి వెన్నుతట్టి ముందుకు నడిపించినవి ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి… ఎప్పుడూ వదులుకోవద్దురా ఓటమి.
అన్న సీతారామశాస్త్రిగారి పదాలు భయం వేసినప్పుడల్లా గుర్తు చేసుకుని పడుకుంటే ఎక్కడలేని ధైర్యం వచ్చేది అని రాజమౌళి చెప్పుకొచ్చారు.
అయితే అప్పటికి రాజమౌళికి శాస్త్రి గారితో పరిచయం చాలా తక్కువట.
మద్రాసులో డిసెంబర్ 31వ తారీకు రాత్రి 10 గంటలకు ఆయన ఇంటికి వెళ్ళగానే ‘ఏం కావాలి నందీ’ అని అడగడంతో ఒక కొత్త నోట్ బుక్ ఆయన చేతుల్లో పెట్టి మీ చేత్తో ఆ పాట రాసివ్వమని అడిగాక రాసి సంతకం చేసి ఇచ్చారట.దానిని జనవరి 1న మా నాన్నగారికి గిఫ్ట్‌గా ఇచ్చాను.నాన్న గారి కళ్ళలో ఆనందం, మాటల్లో కొత్తగా ఎగదన్నుకొచ్చిన విశ్వాసం ఎప్పటికీ మర్చిపోలేను.
సింహాద్రిలో అమ్మయినా నాన్నయినా లేకుంటే ఎవరైనా పాట, మర్యాద రామన్నలో పరుగులు తియ్ పాట ఆయనకు చాలా ఇష్టం.అమ్మ నాన్న లేకపోతే ఎంత సుఖమో అని కానీ, పారిపోవటం చాలా గొప్ప అని కానీ ఎలా రాస్తాము నంది అని తిట్టి, మళ్ళీ ఆయనే ”I Like These Challenges’ అని మొదలు పెట్టారు అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేశారు రాజమౌళి.