కస్టమర్లకు షాక్ ఇచ్చిన జొమాటో.. ఇకనుంచి ఆర్డర్స్ మరింత ప్రియం..

ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో( Zomato ) తన ప్రత్యర్థి స్విగ్గీ బాటనే పట్టింది.దాని అడుగుజాడల్లో నడుస్తూ ఇక నుంచి ఒక్కో ఆర్డర్‌కు రూ.

2 ప్లాట్‌ఫామ్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించింది.ఫుడ్ కార్ట్( Food cart ) విలువతో సంబంధం లేకుండా ఈ ఫీజును జొమాటో సంస్థ కస్టమర్లనుంచి తీసుకోనుంది.

ప్రస్తుతానికి కొందరు యూజర్ల మంచి మాత్రమే ఈ ఫీజును కంపెనీ వసూలు చేస్తోంది.ఈ కొత్త విధానం విజయవంతమైతే దానిని వినియోగదారులందరికీ విస్తరించే అవకాశం ఉంది.ఈ రెండు ఫుడ్ డెలివరీ కంపెనీలు తమ ప్రాఫిట్ పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్లాట్‌ఫామ్ ఫీజును ప్రవేశపెట్టాయి.ప్లాట్‌ఫామ్ ఫీజు రూ.2 మనకు చిన్న అమౌంట్ గా అనిపించినా జొమాటోకు రోజూ వచ్చే లక్షల ఆర్డర్ల వల్ల అది గణనీయమైన ఆదాయాన్ని కంపెనీకి తెచ్చిపెడుతుంది.జూన్ త్రైమాసికంలో జొమాటో దాదాపు 17.6 కోట్ల ఆర్డర్‌లను డెలివరీ చేసింది, అంటే రోజుకు దాదాపు 20 లక్షల ఆర్డర్‌లు వచ్చాయి.ఈ లెక్కన చూసుకుంటే ఒక్కో ఆర్డర్ నుంచి రెండు రూపాయలు తీసుకుంటే రోజుకే కంపెనీ రూ.40 లక్షల లాభం కంపెనీ పొందుతుందని మనం చెప్పవచ్చు.

ప్లాట్‌ఫామ్ ఫీజు( Platform Fee ) ప్రవేశపెట్టడం వల్ల కస్టమర్‌ల నుంచి కొంత ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉంది, అయితే కంపెనీని లాభదాయకంగా ఉంచడానికి ఫీజు వ్యతిరేకత తీసుకురావచ్చు అని జొమాటో భావిస్తోంది.ప్లాట్‌ఫామ్ ఫీజుతో పాటు, జొమాటో తన డెలివరీ ఖర్చులను తగ్గించడం ద్వారా లాభదాయకతను మెరుగుపరుచుకోవాలని చూస్తోంది.కంపెనీ తన సొంత డెలివరీ భాగస్వాములలో పెట్టుబడి పెట్టింది, ఇది దీర్ఘకాలంలో ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుందని జొమాటో విశ్వసిస్తోంది.

Advertisement

ఇక ముందుగా చెప్పుకున్నట్లు ప్లాట్‌ఫామ్ ఫీజు ప్రస్తుతం ఎంపిక చేసిన వినియోగదారులతో పరీక్షించబడుతోంది.ఇది వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తుందా లేదా అనేది అస్పష్టంగా ఉంది.కాబట్టి ఈ ఫీజు ఇంకా మీకు యాప్ లో కనిపించి ఉండకపోవచ్చు.

పుత్రికోత్సాహంలో జగన్.. మమ్మల్ని ఎంతో గర్వపడేలా చేసావంటూ ట్వీట్
Advertisement

తాజా వార్తలు