మ‌రిన్ని టివి ఛాన‌ళ్ల బంద్ కు కేంద్ర రంగం సిద్దం ?

దేశ వ్యాప్తంగా పుట్ట‌గొడుగుల్లాపెరిగిపోయిన టివిఛాన‌ళ్ల పై కేంద్రం దృష్టి సారించింది.

ఇస్లామిక్ బోధకుడు జాకీర్ నాయక్ ప్రసంగాలు వివాదాన్ని నేపథ్యంలో పీస్ టీవీ ్ర‌ప‌సారాలు నిల‌పి వేసిన నేప‌థ్యంలో ఆదేశంలో ఎలాంటి డౌన్లింక్ అనుమతి లేకుండా కేబుల్ ఆపరేటర్లు ద్వారా ప్రసారం చేయబ‌డుతున్న ప‌లు టివి ఛాన‌ళు్ల ఉన్న‌ట్ట గుర్తించింది.

వీటి ప్ర‌సారాల‌ను కూడా నిల‌పి వేయ‌టానికి కేం్ర‌దం రంగం సిద్దం చేస్తోంది.అయితే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏవైనా ప్రసార హ‌క్కుల‌ను కేబుల్ ఆపరేటర్ల పొంది ఉంటే వాటికి సంబంధించిన వివ‌రాలు త‌క్ష‌ణ‌మే అందించాల‌ని రాష్ట్ర స‌మాచార ్ర‌ప‌సార శాఖ‌ల‌కు కీలక అంశాల‌తో రెండు పేజీల లేఖ‌ను పంపింది.

రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తులు పొందిన, పొంద‌ని TV చానెల్స్ ఏవో నిర్ధారించడంతో పాటు వాటి దా్వ‌రా ఎలాంటి కార్య్ర‌క‌మాలు ్ర‌ప‌సార‌మ‌వుతున్నాయో నిర్ధారించుకోవాల‌ని రాష్ట్రాల‌ను కోరింది.ప్రైవేట్ శాటిలైట్ TV ఛానెళ్ళు, చేస్తున్న వ్య‌వ‌హార కార‌ణంగా దేశంలో శాంతి భ‌ధ్ర‌త‌ల‌కు విఘాతం క‌లుగుతోంద‌ని, ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఓ వ‌ర్గం ్ర‌ప‌జ‌ల‌ను రెచ్చ‌గొడుతున్నాయ‌ని భావిస్తున్న‌ట్టు కేంద్రం త‌న లేఖ‌లో స్ప‌ష్టం చేసింది.

కేం్ర‌ద‌ సమాచార ప్రసార శాఖలో కూడా మతతత్వ ఉగ్రవాద హింస ప్రోత్సహించ‌డ‌మే లక్ష్యంగా ప‌నిచేస్తూ, బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్న టివి ఛాన‌ళ్ల‌పై అనేక ఫిర్యాదులు ఉన్న క్ర‌మంలోనే ఈ నిర్ణ‌యం తీసుకొంది.రాష్ట్రాలు ఇచ్చే నివేదిక‌ల ఆధారంగా అడ్వ‌యిజ‌రీ బోరు్డ‌కి నివేదించి త‌గిన చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని సీనియ‌ర్ అధికారి ఒక‌రు ఢిల్లీలో చెప్పారు.

Advertisement