మంత్రి అమర్నాథ్ నియోజకవర్గం మార్పుపై వైవీ సుబ్బారెడ్డి రియాక్షన్..!

అనకాపల్లి నియోజకవర్గం నుంచి మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డిని మార్చడంపై వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు.

అనకాపల్లి అసెంబ్లీ టికెట్ విషయంలో రెండు నెలల కిందటే చర్చించామని తెలిపారు.

గుడివాడ అమర్నాథ్ రెడ్డికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.అయితే అనాకపల్లి నియోజకవర్గం నుంచి మంత్రి గుడివాడ అమర్నాథ్ ను మారుస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

అనకాపల్లి నియోజకవర్గానికి భరత్ ను ఇంఛార్జ్ గా నియమించారు.అయితే నియోజకవరాన్ని వీడుతున్న నేపథ్యంలో మంత్రి గుడివాడ భావోద్వేగానికి గురైన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు