ప్రజా సమస్యలపై పోరాటం కోసమే యువగళం యాత్ర.. అచ్చెన్నాయుడు

ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకే టీడీపీ నేత నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్రను ప్రారంభిస్తున్నారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు.

ఏపీలో రాక్షస పాలన నడుస్తుందని విమర్శించారు.

ఏపీ మళ్లీ అభివృద్ధి పథంలో నడవాలంటే టీడీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలన్నారు.ఈ నేపథ్యంలో యువగళం యాత్ర సక్సెస్ అయ్యేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Yuvagalam Yatra Is For Fighting Public Issues.. Achchennaidu-ప్రజా స

జగన్ ప్రభుత్వ విధానాలతో తీవ్రంగా నష్టపోతున్న యువతకు ప్రశ్నించే వేదిక కల్పించనున్నట్లు వెల్లడించారు.కుప్పం నుంచి ప్రారంభం కానున్న యువగళం యాత్ర సుమారు నాలుగు వేల కిలో మీటర్ల మేర కొనసాగనుంది.

ఈ మేరకు పాదయాత్రలో భారీగా పాల్గొని విజయవంతం చేయాలని అచ్చెన్నాయుడు కోరారు.

Advertisement
మీ గోర్లు పొడుగ్గా దృఢంగా పెరగాలా.. అయితే ఈ చిట్కాలను మీరు ట్రై చేయాల్సిందే!

తాజా వార్తలు