ఢిల్లీలో వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల మకాం

వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీలో మకాం వేశారు.

ఈ మేరకు నిన్న హస్తినకు వెళ్లిన ఆమె ఇవాళ కానీ రేపు కానీ కాంగ్రెస్ పెద్దలను కలవబోతున్నారని తెలుస్తోంది.

కాంగ్రెస్ లో వైఎస్ఆర్ టీపీ విలీనంతో పాటు తెలంగాణలో రానున్న ఎన్నికల నేపథ్యంలో పోటీపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ఆగస్ట్ 31న కాంగ్రెస్ అగ్రనేతలతో పార్టీ విలీనంపై షర్మిల చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.

పార్టీ విలీనం, ఎన్నికల్లో పోటీ అంశాలపై కాంగ్రెస్ వ్యూహాకర్త సునీల్ కనుగోలుతో షర్మిల చర్చలు జరిపారు.ఇక పాలేరు నుంచి పోటీ చేయాలన్న అంశంపై షర్మిల పట్టు వీడారని తెలుస్తోంది.

ఈ క్రమంలో సికింద్రాబాద్, ఖమ్మం లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది.ఈ మేరకు పోటీ ప్రతిపాదనలను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తుంది.

Advertisement

మరోవైపు షర్మిలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పోస్టు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.

కాఫీ, టీ తాగే ముందు మంచినీళ్లు తాగితే మంచిదా..కాదా?
Advertisement

తాజా వార్తలు