జనసేన - వైసీపీ పొత్తు ....? మళ్లీ చర్చలు జరుగుతున్నాయా ...?

హైదరాబాద్ లోని ఓ రిటైర్డ్ అధికారి ఇంట్లో తాజాగా రెండు పార్టీల నేతల మధ్య చర్చలు జరిగాయని ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈ మేరకు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు, మై హోంస్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వర్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారని.

ఈ సందర్భంగా జనసేనకు 15 నుంచి 25 అసెంబ్లీ సీట్లు, నాలుగు ఎంపీ సీట్లు కేటాయించే విషయమై అభిప్రాయ సేకరణ కూడా జరిగిందనే వార్తలు తాజాగా.జోరందుకున్నాయి.

అయితే ఈ విషయాన్ని బయట ఎక్కడా లీక్ అవ్వకుండా .ఇరు పార్టీల నేతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం.ఏపీలో అధికారంలోకి రావాలని జగన్ - పవన్ ఇద్దరూ రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు.

ఒక దశలో రెండు పార్టీల మధ్య పొత్తు ఒకే అయిపొయింది అనుకుంటున్న సమయంలో ఏమైందో ఏమో కానీ అది కాస్తా బెడిసికొట్టింది.

Advertisement

ఆ తరువాత ఇంకేముంది ఛీ .ఆ పార్టీతో మాకు పొత్తా .? అబ్బే అదేం లేదు.మేము ఒంటరిగానే ఎన్నికల బరిలోకి వెళ్తున్నాం అంటూ.

ఇరు పార్టీల అధినేతలు ప్రకటించారు.దీంతో ఇంకేముంది ఏపీలో ఎవరికి వారే తమ తమ బలా బలాలు నిరూపించుకుంటారని.

ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు అనే ఆలోచనే ఉండదని అంతా భావించారు.కానీ ఎవరూ ఊహించని విధంగా ఇలా ఈ రెండు పార్టీలు కలిసి టీడీపీని అడ్డుకునేందుకు సిద్ధం అవుతున్నట్టు .దానిలో భాగంగానే పొత్తుల ఎత్తుగడలు వేస్తున్నట్టు తెలుస్తోంది.అసలు పొత్తులకు సంబంధించి జగన్, పవన్ కళ్యాణ్ వాస్తవ పరిస్థితులకు తగినట్లుగా ఆలోచింది ఒకరికి ఒకరు సహకరించుకుంటే.

టీడీపీకి అధికారం అనేది దక్కదు.ఎందుకంటే.

రాయల సీమ జిల్లాల్లో వైసీపీ, కోస్తా జిల్లాల్లో జనసేనకు పూర్తి స్థాయిలో పట్టు ఉంది.

Advertisement

అయితే.ఇప్పటికే వైసీపీ- జనసేన పార్టీల మధ్య పొత్తు కు సంబంధించి రెండు మూడు ధపాలుగా.చర్చలు జరిగాయి.

కానీ ఫలితం ఇవ్వలేదు.ఈ లోపు తెలంగాణ ఎన్నికల్లో టీడీపీకి బద్దశత్రువైన కాంగ్రెస్‌తో కలసినప్పుడు లేనిది వైసీపీ, జనసేన కలిస్తే తప్పేంటనే ప్రశ్న మొదలయ్యింది.

అందుకే.రాజకీయ అవసరాలకోసం వైసీపీ, జనసేన కూడా పంతాలు పట్టింపులు వదిలి ఒక్కటయ్యేందుకు చూస్తున్నట్టు అర్ధం అవుతోంది.

కాకపోతే ఇప్పటివరకు జరిగిన అన్ని చర్చలను చూస్తే.కేవలం సీట్ల దగ్గరే మొత్తం పేచీ అంతా స్టార్ట్ అవుతోంది.

అదీ కాకుండా సీఎం పీఠం ఎవరు ఎక్కాలని విష్యం కూడా ఈ వ్యవహారం ముందుకు వెనక్కు వెళ్లకుండా అడ్డుకట్ట వేస్తోంది.ఏది ఏమైనా ప్రస్తుతం జరుగుతున్న చర్చలు దాదాపు ఒక కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తోంది.

తాజా వార్తలు