YCP : వైసీపీ తొమ్మిదో జాబితా విడుదల ..!!

ఏపీ ఎన్నికల విషయంలో అధికార పార్టీ వైసీపీ ( YCP ) వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.

ఎన్నికల ప్రచారం మరియు అభ్యర్థుల ఎంపిక వంటి విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంది.

ఎన్నికలకు ఏడాది ముందు నుంచే నాయకులను నిత్యం ప్రజలలో ఉంచుతూ ఒకపక్క సర్వేలు చేయించుకుని వాటి ఫలితాలు ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఈ క్రమంలో సిట్టింగ్ అభ్యర్థులకు సంబంధించి వ్యతిరేకత ఉంటే పక్కన పెట్టేస్తున్నారు.

ఇప్పటికే 8 జాబితాలు విడుదల చేయడం జరిగింది.

Ycp : వైసీపీ తొమ్మిదో జాబితా విడ�

తాజాగా నేడు 9వ జాబితా రిలీజ్ చేయడం జరిగింది.ఈ జాబితాలో ఒక పార్లమెంట్, రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసీపీ ఇన్చార్జిలను ప్రకటించారు.నెల్లూరు పార్లమెంట్ ఇన్చార్జిగా విజయసాయిరెడ్డి ( Vijayasai Reddy )ఖరారు అయ్యారు.

Advertisement
YCP : వైసీపీ తొమ్మిదో జాబితా విడ�

కర్నూలు అసెంబ్లీ ఇన్చార్జిగా మాజీ ఐఏఎస్ ఇంతియాజ్( Ex-IAS Imtiaz ), మంగళగిరి అసెంబ్లీ ఇన్చార్జిగా మురుగుడు లావణ్యను( Lavanya ) .వైసీపీ అధిష్టానం ప్రకటించింది.ఇప్పటికే 8 జాబితాలను విడుదల చేసిన అధిష్టానం తాజాగా 9వ జాబితా రిలీజ్ చేయడంతో ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

మంగళగిరికి గతంలో గంజి చిరంజీవిని సమన్వయకర్తగా నియమించగా.ఇప్పుడు ఆ స్థానంలో మార్పు చేయడం జరిగింది.దీంతో మంగళగిరిలో నారా లోకేష్ పై వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య పోటీ చెయ్యనున్నట్లు తెలుస్తోంది.

ఎట్టి పరిస్థితులలో వచ్చే ఎన్నికలలో 175 కి 175 గెలిచేలా వైసీపీ అధినేత సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఒకే ఒక్కమాటతో చిరు, నాగ్, వెంకీ మల్టీస్టారర్ మూవీ క్యాన్సిల్ అయ్యిందట.. !
Advertisement

తాజా వార్తలు