" పవన్ కళ్యాణ్ నోరు తెరిచి మాట్లాడు "

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో భూదందా జరుగుతోందని, రైతుల వద్ద నుంచి భూములు తీసుకొని కావాల్సిన వారికి అప్పనంగా కట్టబెడుతున్నా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ ఎందుకు స్పందించడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రోజా నిలదీశారు.

పవన్ కల్పించుకుంటే తప్పా ఈ దందా వ్యవహారం ఒక కొలిక్కి రాదని అన్నారు.

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను చూసే ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు చంద్రబాబుకు ఓటు వేశారని అన్నారు.రోజా చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నాయకులు, పలువురు మంత్రులు ఇప్పటికే స్పందించారు.

పవన్ కళ్యాణ్ మాత్రం ఇంతవరకు స్పందించలేదు.రాజధాని భూముల విషయంలో రైతుల పక్షాన అప్పట్లో పవన్ కళ్యాణ్ నిలబడ్డసంగతి విదితమే.

రైతుల కోసం అవసరమైతే దీక్ష చేస్తానని కూడా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.ఇప్పుడు రోజా వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు అన్నది తెలియాలి.

Advertisement

అసలు పవన్ కళ్యాణ్ రోజా వ్యాఖ్యలపై స్పందిస్తారా లేదా అన్నది కూడా త్వరలోనే తేలిపోతుంది.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Advertisement