ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందిన దగ్గర నుంచి అన్ని విషయాలలోను వైసీపీ ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది.
పార్టీలోని కీలక నేతలు చాలామంది రాజీనామా చేసి ఇతర పార్టీల్లోకి వెళ్లిపోగా, మిగిలిన నాయకులు అంత యాక్టివ్ గా కనిపించడం లేదు.
దీంతో వైసిపి కూడా పూర్తిగా నిరాశ, నిస్పృహల్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది.ఆ ప్రభావం ఎన్నికల పైన కనిపిస్తుంది.
త్వరలో జరగబోయే రెండు గ్రాడ్యుయేట్ ఎన్నికలతో పాటు , విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి .దీంతో ఈ ఎన్నికల్లో గెలిచేందుకు టిడిపి ముందు నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉండగా , వైసిపి మాత్రం యాక్టివ్ గా కనిపించడం లేదు .ఈ ఎన్నికలపై వైసిపి మౌనంగానే ఉంది.ఉమ్మడి గోదావరి జిల్లాలు , ఉమ్మడి కృష్ణ , గుంటూరు జిల్లాలో(Joint Godavari Districts, Joint Krishna, Guntur District) పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు , విజయనగరం(Vizianagaram) జిల్లాలో జరిగే స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది.
అయితే ఈ ఎన్నికలపై వైసీపీ అంత ఆసక్తి చూపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.ఇక ఈ విషయంలో టిడిపి చురుగ్గా ఉంది.
ఉమ్మడి కృష్ణ , గుంటూరు జిల్లాల అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్(Former Minister Alapati Rajendra Prasad) ను , ఉభయగోదావరి జిల్లా అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ (Perabattula Rajasekhar)పేరును టిడిపి ఖరారు చేసింది.ఈ ఎన్నికలకు మరో ఐదు నెలల సమయం ఉంది.అయితే విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రం ఈ నెలలోనే జరగాల్సి ఉంది .అయినా వైసీపీ మాత్రం అంత చురుగ్గా ఈ విషయంలో కనిపించడం లేదు.వైసిపి (YCP)నుంచి విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన ఇందుకూరి రఘురాజు ఎన్నికలకు ముందు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారనే కారణంతో ఆయనపై అనర్హత వేటు వేశారు.
దీంతో ఇప్పుడు ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి.ఈ నెల 28న ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతోంది.ఇక పట్టబద్దలు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వైసిపి ఉభయ గోదావరి జిల్లాల అభ్యర్థిని ప్రకటించలేదు.
ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతంరెడ్డిని వైసీపీ(YCP nominated Gautham Reddy as MLC candidate) అధిష్టానం ఫైనల్ చేసింది .కూటమి నుంచి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఉన్నారు.ఈయనకు మూడు పార్టీల నుంచి మద్దతు ఉంది .ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఎన్నికల ప్రచారం కూడా మొదలు పెట్టేసారు. పట్టబద్దర్ల ఓటర్ల నమోదు ప్రక్రియతో పాటు , మిగతా విషయాల్లోనూ చురుగ్గా వ్యవహరిస్తున్నారు.
కానీ వైసీపీలో మాత్రం ఆ హడావుడి కనిపించడం లేదు.దీంతో వైసిపి ఎన్నికలను సీరియస్ గా తీసుకోవడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియను పెద్దగా పట్టించుకోకపోవడం తో ఎమ్మెల్సీ ఎన్నికలపై వైసీపీ అంత ఆసక్తి చూపించడం లేదనే విషయం అర్థం అవుతోంది.దీనికి కారణాలు ఉన్నాయట.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్లనా ఓటమి తప్పదని వైసిపి భయపడుతోందట.ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకుని ముందుకు వెళ్లినా, ఎన్నికల్లో ఓటమి చెందితే అది పార్టీకి మరింత ఇబ్బందికరంగా మారుతుందని, అదే ఎన్నికలను పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తే ఎన్నికల్లో ఓటమి చెందినా, ఆ ప్రభావం పెద్దగా ఉండదని వైసీపీ అధిష్టానం భావిస్తోంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy