వైఎస్ వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.

సునీల్ యాదవ్ కు బెయిల్ ఇవ్వొద్దంటూ మృతుని భార్య సౌభాగ్యమ్మ కోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు.

దీంతో తదుపరి విచారణను న్యాయస్థానం ఈనెల 27కు వాయిదా వేసింది.కాగా, మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.

గతంలో నిందితులంతా కడప జైలులో ఉండగా.కేసును హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు విచారిస్తున్నందున నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సునీల్ యాదవ్ ఈనెల 6న పిటిషన్ దాఖలు చేశారు.

Advertisement
ఒత్తైన జుట్టును కోరుకునే పురుషులకు వండర్ ఫుల్ క్రీమ్.. వారానికి ఒక్కసారి వాడినా చాలు!

తాజా వార్తలు