పులివెందుల ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ పై వైఎస్ షర్మిల సీరియస్ వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.దీంతో ప్రధాన పార్టీల నాయకులు ప్రచారంలో నిమగ్నమయ్యారు.

ఏపీ కాంగ్రెస్ పార్టీ ( AP Congress Party )అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ) కూడా ఈ ఎన్నికలలో పోటీకి సిద్ధం కావడం జరిగింది.కడప పార్లమెంటు స్థానం నుండి పోటీ చేస్తున్నారు.

ఈ మేరకు శుక్రవారం పులివెందులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.పులివెందుల పూల అంగళ్లు సెంటర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో షర్మిల మాట్లాడుతూ.

"రాముడికి లక్ష్మణుడు ఎలాగో.వైఎస్ కు.వివేకా అలాగే.అలాంటి నాయకుడిని చంపితే ఐదేళ్లయిన న్యాయం జరగలేదు.

Advertisement

అధికారం ఉపయోగించి జగన్( YS Jagan Mohan Reddy ) హంతకులను కాపాడుతున్నారు.సీబీఐ సాక్షాదారాలు బయట పెట్టింది.నేను ఎవరికీ భయపడను.

పులి కడుపున పులే పుడుతుంది.అంటూ వైయస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే కాస్త బలపడింది.2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఏపీలో పూర్తిగా తగ్గిపోయింది.గత రెండు సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి.

కానీ ఈసారి మాత్రం అధికార పార్టీకి చెందిన అనేకమంది నాయకులు టికెట్ రానివాళ్లు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు.వైయస్ షర్మిలకి పిసిసి అధ్యక్ష పదవి బాధ్యతలు ఇచ్చిన తర్వాత ఏపీలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది.

'డాకు మహారాజ్ ' సినిమా ట్రైలర్ లో బాబీ చేసిన తప్పు ఏంటో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు