వైఎస్సార్ సంక్షేమ తెలంగాణను అందిస్తా - వైఎస్ షర్మిల

కొల్లాపూర్ నియోజక వర్గం: పెంట్లవెల్లి మండల కేంద్రంలో వైఎస్ షర్మిల గారికి ఘన స్వాగతం.YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కామెంట్స్.

8 ఏళ్లుగా కేసీఅర్ తెలంగాణ ప్రజల కోసం ఏం చేశాడో చెప్పాలి.8 ఏళ్లుగా అంతా కమీషన్ల పాలన.కేసీఅర్ కోసమే పరిపాలన చేసుకున్నారు.

ఆయన బ్రతకాలి.ఆయన కాంట్రాక్టర్లు మాత్రమే బ్రతకాలి.

ఇచ్చిన ఒక్క హామీ అయినా కేసీఅర్ నెరవేర్చలేదు.కేసీఅర్ జన్మకి ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు.

మధ్యంలో మాత్రమే తెలంగాణ అభివృద్ధి చెందింది.గుడులు, బడులు కన్నా మద్యం షాపులు ఎక్కువ.

Advertisement

రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారు.ఇస్తున్న ఎకరాకు 5 వేలు తీసుకున్న రుణం కే కట్టడానికి సరిపోతుంది.

వైఎస్సార్ హయాంలో వ్యవసాయానికి 30 వేల లబ్ది పథకాలు ఉండేవి.అన్ని బంద్ పెట్టీ ముష్టి 5 వేలు ఇస్తే నే కోటీశ్వరులు అవుతారా.

2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఇప్పటి వరకు ఇచ్చిన నోటిఫికేషన్లు 17 వేలు మాత్రమే.పెద్ద పెద్ద చదువులు చదివి పత్తి పీక పోతున్నారు.

ఫీజు రీయింబర్స్మెంట్ పతకాన్ని కేసీఅర్ నిర్వీర్యం చేస్తున్నారు.కెటిఆర్ అంటున్నాడు.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేం కదా అని.కళ్ళముందు కనిపిస్తున్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయండి కెటిఆర్ గారు.కొత్త జిల్లాలు.

Advertisement

కొత్త మండలాలు అన్ని కలుపు కొని 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కదా.తెలంగాణ ఏ వర్గానికి న్యాయం జరగలేదు.మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ లు ఇస్తామని మోసం.

ఇలా అన్ని వర్గాలను మోసం చేసిన ముఖ్యమంత్రి మనకు అవసరమా.మాట మీద నిలబడలేని నాయకుడు మనకు అవసరమా.

వైఎస్సార్ మాట ఇచ్చాడు అంటే చివరికి ప్రాణం సైతం ఇచ్చాడు.మాట మీద నిలబడే న్యాయకత్వం కోసం వైఎస్సార్ తెలంగాణ పార్టీ.

వైఎస్సార్ సంక్షేమ తెలంగాణ ను అందిస్తా.వైఎస్సార్ ప్రతి పథకాలు బ్రహ్మాండంగా అమలు చేస్తాం.

తాజా వార్తలు