అధికారం కోసం కుట్రలకి తెరతీస్తున్న చంద్రబాబు! శంఖారావంలో జగన్ వాఖ్యలు!

ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఆధీనంలో ఉండాల్సిన ఓటర్స్ డేటా ఓ ప్రైవేట్ కంపెనీ చేతిలోకి ఎలా వెళ్లిందో చెప్పకుండా తిరిగి ఎదురుదాడి చేయడం చద్రబాబుకి భాగా అలవాటైపోయింది అని ప్రతిపక్ష నేత జగన్ విమర్శలు చేసారు.

నెల్లూరు లో సమర శంఖారావం లో పాల్గొన్న జగన్ ప్రజలని ఉద్దేశించి చేస్తున్న ప్రసంగంలో అధికార పార్టీ టీడీపీ, ముఖ్యమంత్రి చంద్రబాబు వైఫల్యాలని అడుగడుగున్నా ఎండ గట్టారు.

ప్రజలలో వస్తున్న వ్యతిరేకతని గ్రహించిన బాబు కుట్రలకి తెరతీసి ఓట్లతొలగింపుకి పాల్పడటం దారుణమని జగన్ విమర్శించారు.సేవామిత్ర పేరుతో ఏపీలో ప్రజల వ్యక్తిగత సమాచారం దొంగిలించిన వ్యక్తిని దొంగ అనే అంటారని విమర్శలు చేశారు.

గత ఎన్నికలలో ఇష్టానుసారంగా హామీలు ఇచ్చి అందులో ఒకటి కూడా చంద్రబాబు నెరవేర్చలేకపోయాడు అని, సింగపూర్ తరహా రాజధాని అంటూ గ్రాఫిక్స్ మాయాజాలం చూపించారని జగన్ దయ్య బట్టారు.ఇప్పటికే అమరావతి అంటే గ్రాఫిక్స్ తప్ప ఏమీ కనిపించడం లేదని జగన్ అన్నారు.

చంద్రబాబు ప్రజలకి చేసింది ఏమీ లేకపోయినా రాష్ట్రాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శలు చేసారు.ప్రజల వ్యక్తిగత సమాచారం దొంగిలించడం నేరం అని సుప్రీం కోర్ట్ చెప్పిన కూడా ఓ ప్రైవేట్ సంస్థకి చంద్రబాబు అప్పగించాడంటే ఎంత పెద్ద నేరమో తెలుసుకోవాలని చెప్పుకొచ్చారు.

Advertisement

ప్రజలని మోసం చేసిన చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి రావాలని కుట్రలకి తెరతీస్తున్నారని చంద్రబాబుపై జగన్ విమర్శలు చేసారు.

Boyle Sports Customer Support And Service Quality : A Practical Guide For UK Players
Advertisement