జగన్ విజయం తో పీకే జీవితమే మారిపోయింది

ఒకప్పుడు బీహార్ లో నితీష్ కుమార్ కు వెనకుండి నడిపించి విజయాన్ని అందించిన పీకే కి మంచి క్రేజ్ వచ్చింది.

అయితే కొద్దీ రోజుల పాటు ఆ క్రేజ్ ఉన్నా ఆ తరువాత పరిస్థితులు అన్నీ మళ్లీ మారిపోయాయి.

అయితే జగన్ మాత్రం పీకే నే తన రాజకీయ వ్యూహకర్త గా నియమించుకొని ముందుకు సాగారు.అయితే వేల కిలోమీటర్ల పాద యాత్ర పుణ్యమో లేక పీకే అందించిన నవ రత్నాల పుణ్యమో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది.

దీనితో ఒక్కసారిగా పీకే డిమాండ్ పెరిగిపోయింది.ప్రతి ఒక్కరూ కూడా పీకే నే తమ రాజకీయ వ్యూహకర్తగా మార్చుకోవాలని చూస్తున్నారు.

మొన్నటికి మొన్న టీడీపీ కూడా పీకే కోసం ప్రయత్నాలు చేస్తుంది అన్న వార్తలు వచ్చాయి.మరోవైపు పశ్చిమ బెంగాల్ సీ ఎం మమతా బెనర్జీ కూడా పీకే సేవలను వినియోగించుకోవాలని చూస్తున్నారట, ఇక తాజాగా తమిళ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నటుడు కమల్ కూడా పీకే తో భేటీ అవ్వడం తో కమల్ పీకే ని తన రాజకీయ వ్యూహకర్త గా వినియోగించుకోవాలని చూస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

ఇలా ప్రతి ఒక్కరూ కూడా పీకే.పీకే అంటూ తెగ తిరుగుతున్నారు అని దీనితో ఆయన డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

నిజానికి 2014 ఎన్నికల్లో కూడా జగన్ పార్టీ విజయానికి కొద్దీ దూరంలోనే ఆగిపోయింది.ఆతరువాత వైసీపీ నుంచి 23 మంది టీడీపీ లోకి జంప్ చేయడం,

ఆతరువాత పరిస్థితిలు అన్నీ కూడా మారిపోయినప్పటికీ జగన్ మాత్రం చాలా ఆత్మవిశ్వాసం తో ధైర్యం తో ముందుకు వెళ్ళడానికి గల కారణం కూడా పీకే యొక్క రాజకీయ వ్యూహమే అని అందరూ భావిస్తున్నారు.ఆ పార్టీని ఎన్నికల సమయంలో ఒక పద్దతి ప్రకారం నడిపించి ఎక్కడికక్కడ జగన్ వేసే ప్రతి అడుగును కూడా తీర్చి దిద్దిన ఘనత పీకే కే దక్కుతుంది అని చెప్పాలి.వైసీపీ పార్టీ అందించే నవరత్నాలు ఆ పార్టీ గెలుపు విషయం లో కీలక పాత్ర పోషించాయి.

ప్రతి ఒక్కటి కూడా చాలా జాగ్రత్తగా వ్యూహాన్ని రచించి మరీ పార్టీ కి విజయాన్ని అందించాడు పీకే.ప్రస్తుతానికి పీకే డిమాండ్ మాత్రం అమాంతం పెరిగిపోవడం తో అన్ని రాజకీయ పార్టీలు కూడా పీకే కోసం ఎదురుచూస్తున్నాయి.

తెలంగాణ లోక్ సభ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న సీపీఎం..!!

Advertisement

తాజా వార్తలు