మోదీకి శుభాకాంక్షలు తెలియజేసిన వైఎస్ జగన్..!!

ఆదివారం రాష్ట్రపతి భవన్ లో మోదీ( Narendra Modi ) మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుండి ప్రముఖులు సినీ నటులు హాజరయ్యారు.

ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు కూడా హాజరు కావడం జరిగింది.తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హాజరయ్యారు.

విదేశాల నుండి భూటాన్ పీఎం షేరింగ్ తోబ్‌గే, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మొయిజ్జు, శ్రీలంక అధ్యక్షుడు విక్రం సింఘే హాజరయ్యారు.

బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, మణిపూర్ సీఎం బీరెన్ సింగ్, ఉత్తరాఖండ్ సీఎం దామీ, మండి ఎంపీ కంగనా రనౌత్, బీహార్ సీఎం నితీశ్ కుమార్, సూపర్ స్టార్ రజనీకాంత్, సీజేఐ చంద్రచూడ్ తదితరులు పాల్గొన్నారు.ఇదిలా ఉంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ( YS Jagan )మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీకి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేశారు."భారత్ ప్రధానిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక అభినందనలు" అని పోస్ట్ పెట్టడం జరిగింది.

Advertisement

వైయస్ జగన్ పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇదిలా ఉంటే ఈసారి మోదీ క్యాబినెట్ లో రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఐదుగురికి చోటు దక్కింది.

ఆ ఎమ్మెల్యేలపై లీగల్ వార్ కు బీఆర్ఎస్ రెడీ 
Advertisement

తాజా వార్తలు