భారత దేశం రక్షణకై యువత మనోధైర్యంతో ముందడుగు వేయాలి. డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్

ఖమ్మం నగరంలోని స్థానిక నిజాంపేట్ యుటీఎఫ్ భవన్ లో డివైఎఫ్ఐ వన్ టౌన్ కమిటీ.ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సమావేశానికి డివైఎఫ్ఐ వన్ టౌన్ అధ్యక్షుడు రావులపాటి నాగరాజు అధ్యక్షతన సమావేశం ప్రారంభించారు.ముఖ్య అతిథులుగా డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు షేక్ బషీరుద్దీన్ ,మద్దాల ప్రభాకర్, వన్ టౌన్ సిపిఎం సీనియర్ నాయకులు డాక్టర్ సుబ్బారావు గారు హాజరు కావడం జరిగింది.

Youth Should Step Forward With Courage To Save India DYFI District Secretary She

డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బషీరుద్దీన్ మాట్లాడుతూ దేశ రక్షణగా యువతి యువత మనోధైర్యంతో పిడికిలి బిగించి ముక్తకంఠంతో ముందడుగు వేయాలని మీకు మేము మన ప్రజాతంత్ర యువజన సమైక్య సంఘం DYFI తోడుగా ఉంటుంది పిలుపునిచ్చారు.మిగతా ముఖ్య పెద్దలు మాట్లాడుతూ ఇప్పుడు ఉన్నటువంటి యువత సరైన సక్రమమైన మార్గంలో నడవలేని పరిస్థితి ఎంతో మంది యువత చెడు వ్యసనాలకి బానిసలై దేశంలో అభాగ్యులై తిరుగుతున్నారు.

వారికి ఏది మంచో ఏది చెడో కూడా తెలుసుకోలేని చెప్పలేని పరిస్థితిలో కూడా ఈ సమాజం నడుస్తుందని కూడా చెప్పడం జరిగింది.కానీ ఇప్పటికైనా తప్పక యువత మారాలి.

Advertisement

భవిష్యత్తు లో కూడా యువతని మార్చాల్సిన బాధ్యత డివైఎఫ్ఐ కార్యకర్తలుగా మీపై ఉన్నదని మరొకసారి గుర్తు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు వన్ టౌన్ బాధ్యులు కూరపాటి శ్రీనివాస్, డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు నవీన్ ,పవన్, డివైఎఫ్ఐ వన్ టౌన్ ఉపాధ్యక్షుడు ధనలకోట రవికుమార్,వన్ టౌన్ కమిటీ సభ్యులు ఎలగందుల అనిల్ కుమార్, వినయ్ సాయి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు