దానికి నేనేమీ బ్రాండ్ అంబాసిడర్ కాదు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో మరో సక్సెస్ ను అందుకున్న సంగతి తెలిసిందే.

దేవర మాస్ సినిమా అయినా కొరటాల శివ అద్భుతంగా తెరకెక్కించారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా ఎన్టీఆర్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.ఆర్.ఆర్.ఆర్ మూవీ కోసం చాలా రోజుల పాటు నీళ్లలోనే ఉండాల్సి వచ్చిందని తారక్ తెలిపారు.

దేవర సినిమా కోసం దర్శకుడు కొరటాల శివ కూడా నన్ను వదల్లేదని ఆయన కామెంట్లు చేశారు.ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూస్తుంటే దేవర సీక్వెల్ లో సైతం వాటర్ సీక్వెన్స్ తప్పేలా లేదని తారక్ తెలిపారు.విజువల్ ఎఫెక్ట్స్( Visual effects ) కు నేను బ్రాండ్ అంబాసిడర్ కాదని యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెల్లడించారు.

ఈ విషయం గురించి జక్కన్న ఎంతసేపైనా మాట్లాడతారని తారక్ కామెంట్స్ చేశారు.ఒక నటుడిగా అది ఎంత కష్టమో నాకు తెలుసని విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా వాటర్ క్రియేట్ చేసి ఆ వాటర్ ను నిజమైనదిలా కనిపించేలా చేయడం ఎంతో కష్టమని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు.

Advertisement

దేవర క్లైమాక్స్ సీన్స్ కోసం 35 రోజుల కంటే ఎక్కువ రోజులు పని చేశామని తారక్ తెలిపారు.ఆ సీన్స్ అద్భుతంగా రావడం కోసం ఎంతోమంది కష్టపడ్డారని తారక్ పేర్కొన్నారు.

ఆ సన్నివేశాల కోసం ఎంతోమంది కష్టపడ్డారని తారక్ వెల్లడించారు.

ఈ మూవీ నార్త్ అమెరికాలో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది.ఈరోజు సాయంత్రం సమయానికే అక్కడ ఈ సినిమాకు 4మిలియన్ డాలర్ల కలెక్షన్లు వచ్చాయి.దేవర టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటం కూడా రికార్డ్ స్థాయి కలెక్షన్లకు ఒక విధంగా కారణమని తెలుస్తోంది.

లైంగిక శ‌క్తిని దెబ్బ‌తీసే ఈ ఆహారాల‌తో జ‌ర జాగ్ర‌త్త‌!
Advertisement

తాజా వార్తలు