ఎన్టీఆర్30 దర్శకుడు మారనున్నాడా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలా చేయనున్నారా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో సినిమాకు సంబంధించి గతేడాది ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.

ఆచార్య ఫ్లాప్ వల్ల ఒత్తిడికి గురైన కొరటాల శివ ఈ సినిమా స్క్రిప్ట్ పై సరిగ్గా దృష్టి పెట్టలేకపోతున్నారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.మరోవైపు తారక్ కు జోడీగా సరైన స్టార్ హీరోయిన్ ను ఎంపిక చేయడం దర్శకనిర్మాతలకు సవాల్ గా మారింది.

ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నటిస్తున్న సినిమా కావడం, జనతా గ్యారేజ్ కాంబో రిపీట్ అవుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.అయితే ఈ సినిమా షూటింగ్ అంతకంతకూ ఆలస్యం కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అప్సెట్ అవుతున్నారు.

షూటింగ్ మరింత ఆలస్యం అయ్యే పరిస్థితి ఏర్పడితే మాత్రం తారక్ బుచ్చిబాబు కాంబో మూవీ ఎన్టీఆర్30 మూవీగా తెరకెక్కే ఛాన్స్ ఉంది.ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ను బుచ్చిబాబు ఇప్పటికే పూర్తి చేశారు.

Advertisement

ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.సెకండాఫ్ లో కొన్ని మార్పులు చేయాలని ఎన్టీఆర్ బుచ్చిబాబుకు సూచనలు చేయగా సుకుమార్ సహాయంతో ఇప్పటికే బుచ్చిబాబు ఆ మార్పులు చేశారని సమాచారం.

తారక్ కొరటాల శివకు మరికొన్ని రోజుల సమయం ఇవ్వనున్నారని అప్పటికీ ఈ ప్రాజెక్ట్ మొదలుకాకపోతే బుచ్చిబాబు ప్రాజెక్ట్ ను తారక్ మొదలుపెట్టనున్నారని బోగట్టా.

మరోవైపు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెల నుంచి మొదలుకానుంది.ఈ సినిమా మొదలయ్యే సమయానికి తారక్ ఒక ప్రాజెక్ట్ ను పూర్తి చేయాల్సి ఉంది.సాధారణంగా తారక్ ఖాళీగా ఉండటానికి అస్సలు ఇష్టపడరు.

తారక్ తర్వాత ప్రాజెక్ట్ లు సైతం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.సినిమాసినిమాకు తారక్ రేంజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాతోనైనా భావన కెరీర్ గాడిలో పడుతుందా.?
Advertisement

తాజా వార్తలు