ఎస్ఐ వేధింపులు తాళలేక యువకుడి ఆత్మహత్య..!? వరంగల్ లో ఘటన

వరంగల్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది.గీసుకొండలో వంశీ అనే యువకుడు పురుగుల మందు తాగి బలవన్మరణం చెందాడు.

అయితే వంశీ గీసుకొండ ఎస్ఐ వేధింపులు తాళలేకనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.వంచనగిరిలోని ఓ ఇంట్లో దొంగతనం చేశాడని వంశీపై ఆరోపణలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో ఐదు తులాల బంగారం చోరీ చేశాడని వంశీపై ఫిర్యాదు వచ్చింది.తాను దొంగతనం చేయలేదని చెప్పినా మహిళా ఎస్ఐ వంశీపై చేయి చేసుకున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

తనను అకారణంగా టార్చర్ పెడుతున్నారని వంశీ ఆత్మహత్యకు ప్రయత్నించగా ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

Advertisement
ఇద్దరు తెలుగు డైరెక్టర్లతో సినిమా చేయడానికి సిద్ధం అయిన సూర్య...

తాజా వార్తలు